‘ఛత్రపతి’ హిందీ టీజర్​.. సేమ్ టు సేమ్​ దింపేశారుగా!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్​ వారసుడిగా సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​. అల్లుడు శీనుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్​ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం మెప్పించలేకపోయారు. కొంతకాలంగా కథల ఎంపికపై జాగ్రత్తలు తీసుకుంటున్న శ్రీనివాస్​ చివరగా రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటించిన ఈ క్రైమ్​ థ్రిల్లర్​లో శ్రీనివాస్​ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్​ నటిస్తున్న సినిమా ఛత్రపతి హిందీ రీమేక్​. దర్శకధీరుడు రాజమౌళి‌‌, యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాని వి.వి.వినాయక్​ దర్శకత్వంలో  శ్రీనివాస్​ హీరోగా హిందీలో రీమేక్​ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్​ని విడుదల చేశారు. నేచురల్​ స్టార్ ​నాని నటించిన దసరా సినిమా మార్చి 30న ​ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విరామ సమయంలో ఛత్రపతి టీజర్​ని ప్లే చేసి అభిమానులను సర్​ప్రైజ్​ చేసింది చిత్రబృందం.

తాజాగా విడుదల చేసిన టీజర్​ని చూస్తుంటే చాలావరకు ఒరిజినల్​ సినిమానే ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఛత్రపతి హిందీ రీమేక్​లో బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. 18 ఏళ్ల కిందట ప్రభాస్​ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఎస్​.ఎస్​. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఇది.  ప్రభాస్​ను స్టార్​ హీరోగా మార్చిన సినిమా అని చెప్పవచ్చు. ఇదే మూవీని మన తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం. ఛత్రపతి పేరుతోనే వస్తున్న ఈ సినిమా టీజర్ ను గురువారం (మార్చి 30) రిలీజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్​ యాక్షన్​తో ఇరగదీశాడు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ధవల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ పెన్ స్టూడియోస్ బ్యానర్ కింద మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

అయితే, డైరెక్ట్ హిందీ సినిమా చేయడానికి ముందే బాలీవుడ్​ ప్రేక్షకులకు దగ్గరయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. ‘జయ జానకి నాయక’ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు ఇరగబడి చూస్తున్నారు. ఈ సినిమా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘జయ జానకి నాయక’ 2017 ఆగస్టులో విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించడంతో నాలుగేళ్ల క్రితం పెన్ మూవీస్ సంస్థ హిందీలోకి అనువదించి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ యాక్షన్ మూవీని హిందీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. తెలుగులో కూడా రానంత స్పందన హిందీలో రావడం విశేషం. దీంతో ఈ సినిమా యూట్యూబ్ వ్యూస్ పరంగా ప్రపంచ రికార్డు నెలకొల్పంది. ఏకంగా 709 మిలియన్ వ్యూస్‌తో ప్రపంచంలో యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన వీడియోగా రికార్డుకెక్కింది. అంతేకాదు శ్రీనివాస్​ సినిమాలైన ‘సీత’, ‘కవచం’, ‘సాక్ష్యం’, ‘స్పీడున్నోడు’ వంటి సినిమాల హిందీ అనువాదాలకూ యూబ్యూట్‌లో వందల మిలియన్లలో వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పుడు ‘ఛత్రపతి’ సినిమాతో నేరుగా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ  క్రేజ్  వస్తుందేమో చూడాలి మరి!