WPL: ఆడ‌పులుల టోర్నీకి వేళాయె..!

WPL (Women’s Premiere League) టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో కొద్ది రోజుల్లో ఈ మహిళల టీ20 టోర్నీ షురూ కానుంది. ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్, మ్యాచ్‍ల టైమ్, లైవ్ సహా మ్యాచ్‌ల‌లో త‌ల‌ప‌డ‌నున్న మ‌న ఆడ‌పులుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

మహిళల టీ20 టోర్నీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‍ (Second Season) సమీపిస్తోంది. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీ ఫిబ్రవరి 23వ తేదీన మొదలుకానుంది. మార్చి 17వ తేదీన ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య 23న తొలి మ్యాచ్ జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ వివరాలేంటో ఒక లుక్ వేయండి.

ALSO READ: IPL 2024: కీలక అప్‌డేట్‌ వచ్చేసింది..!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore), యూపీ వారియర్స్ (UP Warriors) జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది టోర్నీలో మొత్తంగా 22 మ్యాచ్‍లు జరగనున్నాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‍లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్ ఉంటాయి. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ఉండే జట్టు నేరుగా ఫైనల్‍కు చేరుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్‌ గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), ఢిల్లీకి ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్ (Meg Lanning), గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆసీస్ స్టార్ బెత్ మూనీ (Beth Mooney), రాయల్ చాలెంజర్స్ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (smriti Mandhana), యూపీ వారియర్స్ టీమ్‍కు ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హేలీ (Alisa Haley) కెప్టెన్సీ చేయనున్నారు. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీ మ్యాచ్‍లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాల్లో జరగనున్నాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‍లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి.

టోర్నీ మ్యాచ్‍లు ‘స్పోర్ట్స్ 18’ నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే.. ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‍లు షురూ అవుతాయి. టాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మార్చి 4 వరకు మొదటి 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (మార్చి 15న ఎలిమినేటర్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ సహా మిగిలినవి) వేదిక కానుంది. అయితే, ప్రారంభ మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ మహిళల జట్టు బెంగళూరులో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ALSO READ: Manoj Tiwary: నన్ను ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా

ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ కోసం పోటీ పడేందుకు ఐదు డైనమిక్ టీమ్‌లతో సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్స్ జట్లు అంతర్జాతీయ స్టార్‌లతో తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతి జట్టులో ఆల్-రౌండర్లు, బ్యాటర్లు, బౌలర్లు, వికెట్ కీపర్‌లు కొత్త ఉత్సాహంతో టోర్నమెంట్‌లో పోటీపడేందుకు ఉత్సాహంగా ఉన్నారు.