Sridhar Reddy: బండి సంజయ్‌కి బడిత పూజ తప్పదు

Sridhar Reddy: భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో బండి సంజయ్ (Bandi Sanjay) అడ్డగోలుగా మాట్లాడుతున్నారని BRS నేత‌ రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న KCRపై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడితపూజ తప్పదు అన్నారు. బండి సంజయ్ నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే మేము చేతికి పని చెప్పాలి ఉంటుందని హెచ్చరించారు. KCR గారు డిల్లీకి వెళ్తారని పత్రికల్లో వార్తలు వస్తె, తప్పు పడుతున్న బండి సంజయ్, ఎంపిగా తను, కిషన్ రెడ్డి ఎందుకు డిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ గ్రూపు తగాదాలు భరించలేక బండి సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. భూతులు మాట్లాడుతూ తన స్థాయిని రోజు రోజుకు దిగజార్చుకుంటున్నరు అన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారు చెప్పాలన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కావాలని బండి సంజయ్ ను ఎవరు అడిగారో చెప్పాలన్నారు. తెలంగాణకు విభజన హామీలు, నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నటికీ శత్రువే అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ సహా ఇతర భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్యర్థులను BRS మట్టు బెట్టింది అన్నారు. ఓడిపోతమనే భయంతోనే పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) గత ఎన్నికల్లో పోటీ చేయెలేదు అన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు దురహంకారంతో కూడినవనీ, తెలంగాణను సాధించిన KCRపై ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఓటమి భయంతో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలో జాతీయ స్థాయి పదవి ఉన్నా, బండి సంజయ్ పరిస్థితి గల్లీ లీడర్ కంటే అధ్వాన్నంగా మారిందన్నారు. అందుకే ఉనికి చాటుకునేందుకు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

బండి సంజ‌య్ ఏమ‌న్నారు?

జమ్మూకశ్మీర్​లో 370 ఆర్టికల్‌(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ వెనుక రాముడు, మోడీ ఉన్నారన్న బండి సంజయ్.. కాంగ్రెస్‌ వెనుక రాక్షసుడు, రాహుల్‌గాంధీ ఉన్నారని విమర్శించారు. BRS​తో భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు. అక్కడికి హాజరైన ప్రజలను చెప్పులు చూపించాలనడంతో వారు అలానే చేశారు.

గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. భారత దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటివి మోడీ సర్కార్​కే సాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో జమ్మూకాశ్మీర్ ​370 ఆర్టికల్ రద్దు చేసినందుకు దేశంలో 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలి. తెలంగాణలో రామరాజ్యం ఏర్పడాలంటే 17 స్థానాల్లోనూ భార‌తీయ జ‌న‌తా పార్టీని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు బండి సంజయ్.

మరోవైపు, నారాయణపేట జిల్లా కృష్ణాలో తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి విజయ సంకల్ప యాత్రను శంఖారావం పూరించి ప్రారంభించారు. అలాగే మరో చోట అసోం సీఎం హిమంత బిశ్వశర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయ సంకల్ప యాత్ర 114 అసెంబ్లీ సెగ్మెంట్​లలో 5,500 కిలోమీటర్ల మేర జరగనుంది. మార్చి 2వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది. మక్తల్ రోడ్ షోలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో BRS ​వల్ల ఇళ్ల నిర్మాణం సరిగా జరగలేదన్నారు. పేదల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గులాబీ పార్టీ మునిగిపోయ నావ అని, ఆ పార్టీతో ఏ రోజూ భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తు పెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్, BRS​ ​రెండూ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు.