Konda Surekha: డెంగ్యూతో బాధపడుతున్న మంత్రి
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ బారిన పడ్డారు. కొంతకాలంగా డెంగ్యూతో బాధపడుతున్నట్లు ఆమె వీడియో రిలీజ్ చేసారు.
అందరికీ నమస్కారం. నేను వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నాను. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. అందుకే బయటికి కానీ అసెంబ్లీకి కానీ రావడంలేదు. చాలా మంది అడుగుతున్నారు కొండా సురేఖ ఎందుకు అసెంబ్లీలో కనిపించడంలేదు అని. కారణం ఇదే. నాకు గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని కొండా సురేఖ వీడియో రిలీజ్ చేసారు.