Alla Ramakrishna Reddy: మళ్లీ YSRCPలోకి..!
Alla Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి YSRCP పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికే చేరనున్నారు. ఇవాళ కానీ రేపు కానీ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల మంత్రి విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) హైదరాబాద్‌లో ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలం కావడంతో ఆయన మళ్లీ తప్పు జరిగిపోయింది అనుకుంటూ పార్టీలోకి వెళ్లనున్నారు. ఇటీవల ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి.. తాను జగన్‌తో కలిసి పనిచేయలేనని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (YS Sharmila) వెంటే నడుస్తానని అన్నారు. ఈలోగా విజయ్ సాయి రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని దారిలోకి తీసుకొచ్చారు.
ఇక తాను జగన్‌తో భరించలేనని ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి డిసెంబర్ 11న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసారు. అయితే రాజీనామా లేఖలో ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే కారణాలు కూడా వెల్లడించలేదు. మీడియా ముందు మాత్రం జగన్ కోసం అంత చేసాను ఇంత చేసాను అని తెగ మాట్లాడేసారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: Nara Lokesh: జగన్‌కు “గ్లాస్” విలువ తెలీదు
ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఆళ్లను దూరం పెడుతూ వచ్చారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అలాగే గంజి చిరంజీవికి వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే చర్చ జరుగుతోందట.. ఈ అంశం కూడా ఆళ్ల రామకృష్ణను బాధపెట్టిందన్న టాక్ ఉంది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కొంతకాలంగా YSRCP నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఈ వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం ప్రారంభించారు. అయితే నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చి గంజి చిరంజీవి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దొంతి వేమారెడ్డి కూడా నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్‌పై (Nara Lokesh) పోటీ చేసి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత మంత్రి పదవి ఆశించినా రాలేదు. అప్పటి నుంచి ఆయన నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిళ వెంటే నడుస్తానని తెగేసి చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత విజయ సాయి రెడ్డి బ్రెయిన్ వాష్ చేసారు. తెలంగాణలోనే ఏమీ చేయలేకపోయిన వైఎస్ షర్మిళను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిస్తే ఆశించిన దాని కంటే పెద్ద పదవే ఇస్తాం అని కూడా అన్నట్లు టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ పార్టీలోకి వెళ్లాలనుకోవడం YSRCPకి కాస్త ఊరటనిచ్చినట్లు అయ్యింది.
ALSO READ: AP Elections: TDPకి జగన్ ఝలక్..!