Kishan Reddy: మూడోసారి కూడా మేమే..!
Kishan Reddy: తెలంగాణలో ప్రచార రథాల ప్రారంభోత్సవ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తామని ప్రకటించారు. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.
రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలి. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుంది.
ALSO READ: Narendra Modi: తర్వాతి స్థానం ఎవరిది?
మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులందరూ యాత్రలో పాల్గొంటారు. రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోదీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాం. (Kishan Reddy)
హైదరాబాద్ పార్లమెంటు కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు నరేంద్రమోదీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. 17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటాం. నరేంద్రమోదీ గారి నాయకత్వంలో సమిష్టిగా పని చేస్తాం. మా జెండా కమలం పువ్వు జెండా…మా నాయకుడు నరేంద్ర మోదీ . కమలం పువ్వు జెండా పట్టుకుని నరేంద్రమోదీ నాయకత్వంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. భారతీయ జనతా పార్టీని ఆదరించండి…నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల్లోని యువకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ వచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాం అని తెలిపారు.
ALSO READ: Narendra Modi: 400 సీట్లతో మళ్లీ వస్తా
2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) భారతీయ జనతా పార్టీకి (BJP) ఊహించినన్ని సీట్లు రాలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటాలని అనుకుంటోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో పార్టీతో చేతులు కలపనున్నట్లు సమాచారం. కానీ తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.