ద‌స‌రా రివ్యూ: బ్లాక్‌బ‌స్ట‌ర్ రిపోర్ట్స్

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన ద‌స‌రా సినిమా.. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ క‌థానాయ‌కగా న‌టించారు. దీక్షిత్ శెట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రిలీజ్ అయింది. నాని కెరీర్‌లో ఇది మొదటి ప్యాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవ‌చ్చు. ఇక సినిమా రివ్యూ విష‌యానికొస్తే.. ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. నాని రా లుక్‌లో సినిమాకు హైలైట్‌గా నిలిచారని అంటున్నారు. ఎంట్రీ సీన్ అయితే వేరే లెవ‌లట‌. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తెలుగు సినిమాకే కొత్తగా ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. టెక్నిక‌ల్‌గా చూసుకుంటే ద‌స‌రా ఫ‌స్ట్ క్లాస్‌లో పాసైపోయింద‌ట‌. సంత్యాన్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ, సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ వేరే లెవ‌ల్ అంటున్నారు. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్‌కి ఇది మొదటి సినిమానే అయినా ఒక ప‌ది బ్లాక్ బస్ట‌ర్ సినిమాలు తీసినంత ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌ట్లు తీసాడని అంటున్నారు. ఇక కీర్తి సురేష్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. 100 కోట్లు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన కేట‌గిరీలో ద‌స‌రా నిలిచిపోతుంద‌ని, ఒక నేచుర‌ల్ స్టార్‌కి మాస్ లుక్ వేసి ర్యాంప్ ఆడిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్‌లో తీసార‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రొమోష‌న్స్ స‌మ‌యంలోనూ నాని ఈ సినిమా త‌న కెరీర్‌లోనే బెస్ట్ అవుతుంద‌ని ఓవ‌ర్ హైప్ ఇచ్చేసారు. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు హిట్ అవుతుందో ఎలాంటి టాక్ వ‌స్తుందోన‌న్న భ‌యం న‌టీన‌టుల్లో ఉంటుంది. కానీ ద‌స‌రా విష‌యంలో మాత్రం నాని క‌న‌బ‌రిచిన కాన్ఫిడెన్స్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల క‌థ చెప్పిన‌ప్పుడే తెలుగు ఇండ‌స్ట్రీకి ఒరిజిన‌ల్ ద‌ర్శ‌కుడు దొరికేసాడు అనిపించింద‌ని నాని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఇక ఈ సినిమా త‌ర్వాత శ్రీకాంత్‌కు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌నకు సినిమా ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌త ఏంటో ట్రైల‌ర్‌లోనే చూపించేసారు. సినిమాను సినిమాలా కాకుండా ఒక రియ‌లిస్టిక్ సీన్‌లా చూపించాల‌న్న ఉద్దేశంతో ఈ సినిమాలో నాని చేత నిజంగానే మ‌ద్యం తాగించార‌ట శ్రీకాంత్. ఒక ఎక్స్‌ప్రెష‌న్ రావ‌డానికి ఆయ‌న ఇంత స్ట్ర‌క్ట్‌గా రూల్స్ సెట్ చేసుకోవ‌డం అనేది మెచ్చుకోద‌గ్గ విషయం. అనుభ‌వం లేని శ్రీకాంత్ సీన్ స‌రిగ్గా రాలేద‌ని అన‌డంతో అస‌లు త‌న‌కు న‌ట‌న వ‌చ్చో రాదోన‌ని అనిపించిందని నాని ఓ సంద‌ర్భంలో తెలిపారు. మొత్తానికి నానికి ఓ ప్యాన్ ఇండియ‌న్ హిట్ వ‌చ్చిప‌డిన‌ట్లేన‌ని అంటున్నారు సినీ విశ్లేష‌కులు.