AP Elections: YSRCPకి ఎన్నిక‌ల సంఘం రూల్స్..!

AP Elections: రెండు నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission Of India) అధికార YSRCP పార్టీకి కొన్ని నిబంధ‌న‌లు పెట్టింది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గన్ మోహ‌న్ రెడ్డి..(Jagan Mohan Reddy) అత‌ని పార్టీ స‌భ్యులు పాల్ప‌డే దారుణాలు అన్నీ ఇన్నీ కావ‌ని.. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌కుండా ఎన్నికల సంఘం త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ కూడా రాసారు.

ఎన్నిక‌ల సంఘం పెట్టిన రూల్స్ ఏంటి?

*గ్రామ‌ల్లోని వార్డు స‌భ్యులు, వాలంటీర్లు ఎవ్వ‌రూ కూడా ఎన్నిక‌లకు సంబంధించిన విష‌యాల్లో త‌ల‌దూర్చకూడ‌దు. వారికి ఎన్నిక‌ల డ్యూటీ విధించ‌కూడ‌దు.

*వారికి ప‌నులు అప్ప‌గించాల‌నుకుంటే ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారి వేళ్ల‌కు ఇంక్ వేయడం వంటి ప‌నులు మాత్ర‌మే చెప్పాలి. అంతకు మించి ఎలాంటి ముఖ్య‌మైన ప‌నులు కూడా అప్ప‌గించ‌డానికి వీల్లేదు.

*గ‌త ఎన్నిక‌ల్లో బూత్ లెవెల్ అధికారులుగా ప‌నిచేసిన‌వారిని ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ నియ‌మించ‌కూడ‌దు. వారు పోలింగ్‌కి సంబంధించిన ఎలాంటి విధుల్లో కూడా క‌నిపించ‌డానికి వీల్లేదు. పోలింగ్ తేదీ రోజున వారికి ఎన్నిక‌ల‌తో సంబంధం లేని ప‌నులు అప్ప‌గించాలి. (AP Elections)

*ప్ర‌త్యేకించి వాలంటీర్లు ఎన్నిక‌లకు సంబంధించిన అంశాల్లో త‌ల‌దూరిస్తే ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం హెచ్చ‌రించింది. వాలంటీర్ల‌ను పోలింగ్ ఏజెంట్లుగా నియ‌మించ‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది.

*కావాలంటే ఎన్నిక‌ల‌కు సంబంధించిన విధుల్లో గ్రామాలు, వార్డుల‌కు చెందిన సెక్ర‌టేరియ‌ట్ సిబ్బందిని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. కాక‌పోతే వారికి ముఖ్య‌మైన ఎన్నిక‌ల ప‌నుల‌కు మాత్రం నియ‌మించ‌కూడ‌దు అని కూడా క్లారిటీగా చెప్పింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌ల వ‌ల్లే..

గ‌తంలో జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాలంటీర్ల గురించి చేసిన షాకింగ్ వ్యాఖ్యల కార‌ణంగానే ఎన్నిక‌ల సంఘం ఈ నిబంధ‌న‌లు విధించిన‌ట్లు తెలుస్తోంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను సేక‌రించి డేటాను దుర్వినియోగం చేస్తున్నార‌ని.. వాలంటీర్లు సేక‌రించిన డేటా వ‌ల్లే ఎంద‌రో ఆడ‌పిల్ల‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని ఆరోపించారు. ఈ వివ‌రాల‌న్నీ త‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అందాయ‌ని తెలిపారు. ఈ ఆరోప‌ణ‌ల వ‌ల్లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం అప్ర‌మ‌త్త‌మైంది. స‌మాచారం ముందే తెలిసినా ఎన్నిక‌ల స‌మ‌యంలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటే జ‌రిగే ప‌రిణామాలేంటో ముందు ప‌సిగ‌ట్టింది. అందుకే ముందుచూపుతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌లు ఎప్పుడు?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కాలేదు. అయితే మార్చి 13 నుంచి 16 వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రోప‌క్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం ప్ర‌కారం ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ఇంకా నోటిఫికేష‌న్ రావాల్సి ఉంది.