Rashmika Mandanna: ఇలాంటి చెత్త రూమ‌ర్స్ ఎక్క‌డి నుంచి వ‌స్తాయ్?

Rashmika Mandanna: నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న గురించి ఎప్పుడూ పాపం ఏదో ఒక వార్త వైర‌ల్ లేదా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా త‌న గురించి ఏద‌న్నా రూమ‌ర్ వ‌స్తే మాత్రం ఎప్పటిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చి అక్క‌డికక్క‌డే ఆ రూమ‌ర్‌ను క్లియ‌ర్ చేసేస్తుంది.  ఇప్పుడు ర‌ష్మిక గురించి ఓ నెటిజ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల ఆమె స్పందించాల్సి వ‌చ్చింది.

ర‌ష్మిక మంద‌న‌, శ‌ర్వానంద్ (Sharwanand) న‌టించిన ఆడాళ్లు మీకు జోహార్లు (Adavallu Meeku Joharlu) సినిమా గురించి ఓ నెటిజన్ ట్విట‌ర్‌లో కామెంట్ పెట్టాడు. దర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌, శ‌ర్వానంద్ కోస‌మే తాను ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాకు ఒప్పుకున్నాన‌ని ర‌ష్మిక ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్లు ఆ అబ్బాయి ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్‌ని రష్మిక మంద‌నకు ట్యాగ్ చేయ‌డంతో ఆమె వెంట‌నే స్పందించారు. (Rashmika Mandanna)

త‌న‌కు స్క్రిప్ట్ న‌చ్చితేనే చేస్తాను త‌ప్ప ఫ‌లానా ద‌ర్శ‌కుడు, హీరో కోసం కాద‌ని ర‌ష్మిక తెలిపారు. “” ఎవ‌రు చెప్పారబ్బా..! నేను స్క్రిప్ట్ న‌చ్చితేనే సినిమా చేస్తాను. సినిమాలోని ఇత‌ర న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించ‌డం ఓ గౌర‌వంగా భావిస్తాను. ఇలాంటి చెత్త రూమ‌ర్స్, వార్త‌లు ఎక్క‌డి నుంచి పుట్టిస్తారో అర్థంకాదు “” అని కాస్త ఘాటుగా స్పందించారు.

న‌టీన‌టుల గురించి త‌ప్పుడు వార్తలు రాసేవారు, కామెంట్స్ పెట్టేవారు ఎక్కువైపోయారు. ఎలాంటి వార్త‌లు రాసినా ఎలాంటి కామెంట్స్ చేసినా అంద‌రి మీద కేసులు పెట్టి అన‌వ‌సరంగా వారిని వారు చిక్కుల్లో ప‌డేసుకోరు అనే ధీమాతో పోకిరి గాళ్లు ఇలాంటి చెత్త ట్వీట్లు చేస్తుంటారు. పైగా ఎలాన్ మ‌స్క్ ట్విట‌ర్‌లో మానిటైజేష‌న్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఎవ‌రు పెట్టే ట్వీట్ల‌కు ఎన్ని ఇంప్రెష‌న్స్ వ‌స్తున్నాయో దానిని బ‌ట్టి డ‌బ్బులు కూడా ఇస్తున్నారు. దాంతో ఏది ప‌డితే అది ట్వీట్ చేసేసి సెల‌బ్రిటీల‌ను ట్యాగ్ చేసేస్తున్నారు.

నిన్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) కూడా ఇలాంటివారి గురించే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. నిజానిజాలు తెలుసుకోకుండా త‌న గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు త‌ప్పుడు వార్తలు రాసేస్తున్నార‌ని.. దొంగ చాటుగా కాకుండా నేరుగా త‌న ఫోటో వేసి వార్త రాసే ద‌మ్ముందా అని ప్ర‌శ్నించారు. ఇంకోసారి ఇలాంటి వార్త‌లు రాసి ట్వీట్స్ చేస్తే క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ర‌ష్మిక మంద‌న సినిమాల విష‌యానికొస్తే.. ఆమె న‌టించిన యానిమ‌ల్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ఇత‌ర సినిమాల్లో పాపం ర‌ష్మిక న‌టన ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్లుగా ఉంద‌ని కామెంట్స్ చేసారు. కానీ యానిమ‌ల్ సినిమాలో మాత్రం ర‌ష్మిక త‌న న‌ట‌న‌తో చించేసింద‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు. ఇప్పుడు ర‌ష్మిక పుష్ప: ది రూల్ (పుష్ప సినిమాకు పార్ట్ 2)లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఓ వ‌ర్కింగ్ స్టిల్‌ని కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. దీంతో పాటు గ‌ర్ల్‌ఫ్రెండ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ న‌టిస్తున్నారు ర‌ష్మిక మంద‌న‌.