Valentine’s Day: ఈ కానుక‌ల‌తో ప‌డేయండి..!

Valentine’s Day: ఏడాది పొడవునా ప్రేమికులు ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14. కొందరు వారి గుండెలో గూడుకట్టుకున్న ప్రేమను అవతలివాళ్లకు వ్యక్తం చేయడానికి ఈ వారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చాలా మంది ఏం గిఫ్ట్ ఇవ్వాలోనని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న కానుకలైనా ..ప్రేమబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. (Valentine’s Day)

ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వారమంతా జంటలు ఒకరితో ఒకరు ఆనందంగా గడుపుతారు. అయితే ఇందులో అత్యంత ప్రత్యేకమైనది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. అలాంటి ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించే ప్రేమికుల రోజున మీ ప్రేయసి లేదా ప్రియుడికి మంచి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వీటిని ఒక లుక్ వేయండి.

ఆల్బమ్ ఇవ్వండి..

కలిసి గడిపిన చిరస్మరణీయ క్షణాలను ఒకే చోటుకు తీసుకురండి. మీరు కలిసి దిగిన ప్రతి ఫోటోతో ఆల్బమ్‌ను తయారుచేయించండి. మీరు ఫొటో కింద ఆ క్షణానికి సంబంధించిన చిన్న క్యాప్సన్ రాయవచ్చు. మీ సొంత మాటల్లో రాస్తే ఇంకా బాగుంటుంది. మీ లవర్ కి మీరు అంటే ఎంతో ఇష్టమో వాలెంటైన్స్ డేకి అర్థమవుతుంది. లేదంటే మీరు ప్రేమ సందేశాన్ని కూడా రాయవచ్చు. మీ భాగస్వామి ఈ బహుమతిని స్వీకరించడానికి సంతోషిస్తారు.

మేకప్ కిట్స్:

ఈ రోజుల్లో మేకప్ కిట్ మెయింటైన్ చేయని అమ్మాయిలు దాదాపు ఉండరనే చెప్పాలి. ప్రేమికుల దినోత్సవానికి మీ ప్రేయసికి మేకప్ కిట్ ఇచ్చి అబ్బురపరచొచ్చు. మీ లవర్ అందాన్ని మరింత రెట్టింపు చేసే మేకప్ కిట్ గిఫ్టుగా ఇవ్వడంతో మీపై ప్రేమ మరింత పెరుగుతుంది.

మెుబైల్ ఫోన్ బ్యాక్ కవర్

మొబైల్ ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమైపోయాయనడంలో సందేహం లేదు. మొబైల్ లేకుండా బతకలేం. ఈ విషయాన్ని కలలో కూడా ఊహించలేం. కానీ చాలా సార్లు హడావుడిగా చేతిలోంచి ఫోన్ పడి విరిగిపోతుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి మీరు మీ భాగస్వామికి మన్నికైన బ్యాక్ కవర్‌ను కొనుగోలు చేసి ఇవ్వొచ్చు. (Valentine’s Day)

రింగ్:

బడ్జెట్ ఎక్కువుగా ఉంటే ఏదైనా లవ్‌ సింబల్ ఉండేటట్లు నగలను కొనివ్వడం లేదా ప్రేమికుల ఇద్దరి పేర్లు ఉండేటట్లు ఒక రింగ్‌ను ఇచ్చి ఐ లవ్‌ యూ చెప్పండి. ఈ నగలు లేదా ఉంగరాలు నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటాను అని చెప్పండి. ఈ విధంగా మీ ప్రేమను వ్యక్తపరచండి.

పెర్ఫ్యూమ్ :

మనం ఎంత బాగా రెడీ అయినా కూడా ఒక్కసారి బాడీకి పెర్ఫ్యూమ్‌ను స్పే చేసుకున్నామంటే రోజంతా ఆ ఉత్సహం వేరేలా ఉంటుంది. అయితే, మీ ప్రేయసికి మీరు అనుక్షణం గుర్తుండాలంటే వారికి ప్రేమికుల రోజు మంచి పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి.

ఎరుపు గులాబీలు:

ఎరుపు గులాబీల బొకేలను మీకు ఇష్టమైన వారికి అందించండి. ఎంత ఖరీదైన వస్తువులను బహుమతిగా అందించినా కూడా గులాబీ పువ్వులు ఇవ్వకపోతే ప్రేమికుల దినోత్సవం పూర్తవ్వదు.

రొమాంటిక్ డిన్నర్:

మీరు ఏ బహుమానం ఇచ్చినప్పటికి ఒక చక్కటి కేండిల్ లైట్ డిన్నర్ ఆమెకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇచ్చేయండి. డిన్నర్ సమయంలో వుండే చక్కటి బ్యాక్ గ్రౌండ్ వీనుల విందు సంగీతం ఆమెకు మరింత ఆహ్లాదాన్నిస్తుంది.

లవ్ లెటర్:

మీ చెతిలో డబ్బులు లేవా…ఈ ప్రేమికుల రోజుకు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానే అని బాధ పడుతున్నారా…? ఎటువంటి బాధ పడకుండా ఒక ప్రేమ లేఖ రాయండి. అందులో మీ తొలి పరిచయం, మీ ఇద్దరు తిరిగిన ప్రదేశాలు, మరిచిపోలేని సంఘటనలు గురించి రాయండి. తద్వారా మీకు ఆమె ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకుని చెప్పడం ద్వారా ఆమెపై మీకున్న శ్రద్ద అర్థమౌతుంది.

పై విధాలలో మీరు ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ ప్రేమకుల రోజున మీ ప్రియురాలి ప్రేమను పొందండి. (Valentine’s Day)