Mahi v Raghav కి 2.5 కోట్లు.. మ‌రి వ‌ర్మ‌కి..?

Mahi v Raghav: యాత్ర‌ (Yatra), యాత్ర 2 (Yatra 2)సినిమాలు తీసిన మ‌హి వి రాఘ‌వ్ (Mahi V Raghav) గురించి రాజ‌కీయ ప‌రంగా వాడి వేడి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు కార‌ణం ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  (YS Jagan Mohan Reddy) అభిమాని కావ‌డ‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అభిమానంతోనే యాత్ర, యాత్ర 2 సినిమాలు తీసారు. ఓ అభిమానిగా ఆయ‌న ఎక్క‌డా కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి కానీ ఆయ‌న కుటుంబం గురించి కానీ త‌క్కువ చేసి చూపించలేదు. దాంతో ఈ సినిమా తీయ‌డానికి జ‌గ‌న్ నుంచి మ‌హి వి రాఘ‌వ్ రూ.25 కోట్లు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు చేసింది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).

కొంత‌కాలంగా ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా మ‌హి వి రాఘ‌వ్ ఎందుకొచ్చిన గొడ‌వ అని స్పందించ‌లేదు. ఇక మ‌రీ మాట్లాడ‌కుండా మౌనంగా ఉంటే త‌ప్పు చేసాడు కాబ‌ట్టి సైలంట్‌గా మాట‌లు ప‌డుతున్నాడు అని అనుకుంటారేమోన‌ని రాఘ‌వ్ ఎట్ట‌కేల‌క స్పందించారు. తాను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి డ‌బ్బు తీసుకున్న మాట నిజ‌మే అని అన్నారు. అయితే కొన్ని ప‌త్రిక‌లు, కొంద‌రు నేతలు ఆరోపిస్తున్న‌ట్లు రూ.25 కోట్లు తీసుకోలేద‌ని.. తాను తీసుకున్న‌ది కేవ‌లం రూ.2.5 కోట్లు మాత్రమే అని అన్నారు. అయితే అది త‌న స్వ‌లాభం కోసం కాకుండా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ కోసం రాయ‌ల‌సీమ‌లో ప్రొడ‌క్ష‌న్ హౌజ్ నిర్మించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. త‌న‌కు డ‌బ్బే ముఖ్యం అనుకుని ఉంటే రాయ‌ల‌సీమ‌లో కాకుండా వైజాగ్‌లో ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెట్టుకునేవాడిన‌ని అన్నారు.

“” నేను మ‌ద‌న‌ప‌ల్లెలో పుట్టాను. నా స్వస్థ‌లంలో నేను క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న డ‌బ్బుతో షూటింగ్ చేసాను. నేను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి డ‌బ్బు తీసుకున్న మాట వాస్త‌వ‌మే. కానీ నాకు నేనొక్క‌డినే తినాలి అన్న స్వార్ధం ఉండి ఉంటే నా ప్రాంతం బాగు కోసం ఎందుకు ఆలోచిస్తాను? నా స్వ‌స్థలంలో ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెట్టుకోవాల‌ని ఎందుకు అనుకుంటాను. నేను హైద‌రాబాద్, వైజాగ్‌లో క‌ట్టుకుని డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు క‌దా. మ‌ద‌న‌ప‌ల్లెలో షూటింగ్‌కి నాకు అయిన ఖ‌ర్చు రూ.25 కోట్లు. నేను జ‌గ‌న్ నుంచి డ‌బ్బు కాకుండా రూ.2.5 కోట్లు విలువ చేసే భూమి మాత్ర‌మే తీసుకున్నాను “” అని స్ప‌ష్టం చేసారు.

మ‌రి వ‌ర్మ ఎంత తీసుకున్నారు?

మ‌రోప‌క్క ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం (Vyooham) అనే సినిమా తీసారు. ఈ సినిమా కూడా ఈ నెల‌లోనే విడుద‌ల కాబోతోంది. డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేయ‌డంతో సినిమాను నిలిపివేసారు. ఆ త‌ర్వాత మ‌రోసారి సెన్సార్ బోర్డుకు సినిమా చూపించి ఈ నెల 18న రిలీజ్ చేసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. వ‌ర్మి ఇప్ప‌టివ‌ర‌కు వ్యూహం సినిమాకు సంబంధించి రెండు ట్రైల‌ర్లు రిలీజ్ చేసారు. రెండు ట్రైల‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే సినిమా జ‌గ‌న్‌కు ఫేవ‌ర్‌గా తీసిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇందుకోసం జ‌గ‌న్ నుంచి వ‌ర్మ దాదాపు రూ.5 కోట్ల వ‌ర‌కు తీసుకున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. అయితే మ‌హి వి రాఘ‌వ్ లాగా వ‌ర్మ తాను ఎంత తీసుకున్నార‌న్న వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు.