Johnny Sins: సీరియ‌ల్‌లో జానీ సిన్స్.. ఏం వాడ‌కం రా బాబూ..!

Johnny Sins: జానీ సిన్స్ గురించి అంద‌రికీ తెలీక‌పోవ‌చ్చు. ఇత‌ని గురించి ఇలా న్యూస్ వెబ్‌సైట్ల‌లో రాయ‌కూడ‌దు. కానీ అంద‌రికీ ఇత‌ను తెలియాల‌ని లేదు క‌దా..! ఈ జానీ సిన్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ పోర్న్ స్టార్. పోర్న్ ఎక్కువ‌గా చూసేవారు ఇత‌న్ని చూడ‌గానే ఇట్టే గుర్తుప‌ట్టేస్తారు. ఇప్పుడు ఇత‌ని గురించి చ‌ర్చ ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా?

జానీ సిన్స్ ఉన్న‌ట్టుండి మ‌న భార‌తీయ సీరియ‌ల్‌లో క‌నిపించారు. అది కూడా సంప్ర‌దాయంగా కుర్తా వేసుకుని మ‌రీ. దాంతో జానీ సిన్స్ ఫ్యాన్స్ అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. సీరియ‌ల్ అంటే ఫ్యామిలీ అంతా స‌ర‌దాగా కూర్చుని చూసే కార్య‌క్ర‌మం. ఈ జానీ గాడు చివ‌రికి అక్క‌డికి కూడా వ‌చ్చేయ‌డంతో పోర్న్ ప్రియుల గుండె ఝ‌ల్లుమంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఆ సీరియ‌ల్‌లో ప‌క్క‌నే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కూడా ఉన్నాడు. ర‌ణ్‌వీర్ సింగ్ ఏదో ఎమోష‌న‌ల్ డైలాగ్ చెప్తుంటే ఆ వెన‌కే జానీ సిన్స్ నిల‌బ‌డి అమాయ‌కంగా చూస్తున్న వీడియో క్లిప్ ఒక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

తీరా చూస్తే అది ఇండియ‌న్ సీరియ‌ల్ కాదు సీరియ‌ల్ లాంటి ప్ర‌క‌ట‌న అని అర్థ‌మైంది. ఇంత‌కీ ఈ యాడ్ దేని గురించో తెలుసా? బోల్డ్ కేర్ అనే శృంగారానికి సంబంధించిన ట్యాబ్లెట్ గురించి. ఈ ట్యాబ్లెట్ గురించి చెప్ప‌డానికి వారు ఏకంగా ఇండియ‌న్ సీరియ‌ల్‌ని వాడేసారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఓ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల‌ని అనుకుంటుంది. అప్పుడు ర‌ణ్‌వీర్ సింగ్ ఆమెను వెళ్ల‌కుండా ఆపాల‌నుకుంటాడు. అస‌లు ఎందుకు వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నావ్ అని ర‌ణ్‌వీర్ అడ‌గ్గా.. ఏం చెప్ప‌మంటావ్ నా బాధ‌. జానీకి నేను చాలా సార్లు చెప్పాను బోల్డ్ కేర్ వాడ‌మ‌ని కానీ ఇత‌ను వాడ‌డు అని చెప్తుండ‌గానే వెన‌క నుంచి ఓ బామ్మ గారు వ‌చ్చి సిగ్గులేనిదానా అంటూ చంప ప‌గ‌ల‌గొడుతుంది.

మ‌న సీరియ‌ల్స్‌లో చేసే ఓవ‌రాక్ష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలా కొట్ట‌గానే వారు ఇలా మేడ‌పై నుంచి ప‌డిపోయినంత ఓవ‌రాక్ష‌న్ చేస్తారు. ఈ యాడ్‌లో కూడా అదే జ‌రిగింది. ఆ బామ్మ గారు ఆ అమ్మాయిని కొట్ట‌డంతో కాలు జారి మేడ‌పై నుంచి ప‌డిపోతుంది. అప్పుడు ర‌ణ్‌వీర్ వెంట‌నే బోల్డ్ కేర్ బాక్స్‌ను జానీకి ఇచ్చి కాపాడ‌మ‌ని చెప్తాడు. జానీ ఆ బోల్డ్ కేర్ ట్యాబ్లెట్‌ను వేసుకుని త‌న భార్య‌ను కింద ప‌డ‌కుండా కాపాడ‌తాడు. అప్పుడు ర‌ణ్‌వీర్ ఈ బోల్డ్ కేర్ గురించి వివ‌రిస్తాడు. చాలా మంది మ‌గ‌వారు శృంగారం విష‌యంలో త‌మ భార్య‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నార‌ని అలాంటివారి కోసమే ఈ బోల్డ్ కేర్ ట్యాబ్లెట్స్‌ని త‌యారుచేసార‌ని చెప్తాడు. ఈ యాడ్‌లో జానీ సిన్స్ డాక్ట‌ర్ గెట‌ప్‌లో ట్యాబ్లెట్ల‌ను ప‌రిశీలించ‌డం మ‌రిన్ని న‌వ్వులు పూయిస్తోంది.

ఇప్పుడు జానీ సిన్స్ పేరు ట్విట‌ర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. కొంత‌మందేమో ఇలాంటి వారిని ఎందుకు ఇండియ‌న్ యాడ్స్‌లో వాడుతున్నారు అని మండిప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రేమో క్రియేటివిటీ, మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి అంటూ ఇండియన్ క్రియేటివిటీని తెగ పొగిడేస్తున్నారు.