Viral News: పెళ్లైన రాత్రే జంప్ అయిపోయిన వరుడు.!
Viral News: పెళ్లై నచ్చకపోతేనో లేదా కేవలం డబ్బు, బంగారం దోచుకుపోవడానికి పెళ్లి చేసుకునే వారిని చూసాం. ఇలాంటివారు పెళ్లి చేసుకుంటామని చెప్పి రాత్రి అవ్వగానే నగలు, డబ్బు సర్దేసి జంప్ అయిపోతుంటారు. లేదా.. ఓ ఆడపిల్ల మరో వ్యక్తిని ప్రేమించడం వల్ల ఇంట్లో నుంచి ఇలా వెళ్లిపోతుంటుంది. ఇలాంటి ఘటనే బిహార్లో చోటుచేసుకుంది. పెళ్లైన రాత్రే వరుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా మూడు రోజుల తర్వాత దొరికిపోయాడు.
ముజఫర్పూర్కి చెందిన ఆదిత్య షాహి అనే యువకుడికి బొచాహన్ ప్రాంతానికి చెందిన వధువుతో ఫిబ్రవరి 4న ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే ఫిబ్రవరి 4 రాత్రి సమయంలో వధువు నిద్రపోతుండడం గమనించి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఉదయం లేచి చూడగానే ఆదిత్య ఎక్కడా కనిపించకపోయే సరికి అంతా కంగారుపడ్డారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆదిత్య కోసం గాలిస్తుండగా అతను తన బ్యాంక్ నుంచి ఏటీఎం ద్వారా రూ.50,000 విత్డ్రా చేసుకుని పట్నా బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకోగలిగారు.
ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని తన జాడ తెలీకూడదని తన ఫోన్ను స్విఛాఫ్ చేసుకున్నాడు. మూడు రోజుల పాటు అసలు ఫోన్ ఆన్ చేయలేదు. దాంతో పోలీసులు అతని ఆచూకీని వెంటనే కనిపెట్టలేకపోయారు. మూడో రోజు ఆదిత్య తన ఫోన్ ఆన్ చేయడంతో లొకేషన్ ట్రాక్ అయ్యింది. అతను ఉన్న ప్రదేశంలోని పోలీసుల సాయంతో ఆదిత్యను పట్టుకుని కుటుంబీకులకు అప్పగించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాట వాస్తవమే కానీ ఇలా ఎందుకు వెళ్లిపోవాలనుకున్నాడో మాత్రం వెల్లడించలేదు.
బిహార్లో ఎక్కువగా ఆడపిల్లలు ఇలా ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంటారు. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. బిహారీలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని కూడా ఆలోచించరు. విషయం తెలీడంతో ముందు కొట్టి మాట్లాడే టైపు. పైగా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అనడంతో వధువు కుటుంబం నిందలు వేయడం మొదలుపెట్టింది. దాంతో ఆదిత్య తండ్రి మాటలు పడలేక అతన్ని పోలీసుల ముందే చావబాదాడు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా అని రెచ్చిపోయాడు. అయినా కూడా ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. దాంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఆదిత్యను ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో పోలీసులు కూడా తెల్లారే వరకు పరిస్థితి కాస్త శాంతించే వరకు అక్కడే ఉన్నారట. ఇరు వైపుల వాదనలు వింటూ ఆదిత్య ఏం జరిగిందో ఎప్పటికైనా నోరు విప్పి చెప్పకపోతాడా అని పోలీసులు ఎదురుచూస్తూ కూర్చున్నారు. అక్కడి పోలీసులు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఇంటి సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అన్నట్లుగా అక్కడి వారు ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్ని కుటుంబాలైతే సమస్య తేలే వరకు ఘటనా స్థలం నుంచి కదిలితే పై అధికారులతో మాట్లాడి ఉద్యోగాలు తీయించేస్తాం అన్నట్లు బెదిరిస్తుంటారు.