Uttam Kumar Reddy: నేడు మంత్రి.. రేపు ముఖ్యమంత్రి..!
Uttam Kumar Reddy: తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయంలో ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఉత్కంఠ కంటే కాంగ్రెస్ పార్టీ (Congress) నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే అంశమే గట్టి డిబేట్‌కు దారి తీసింది. మూడోసారి BRS పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మరో సందేహం లేకుండా మూడోసారి కూడా కేసీఆరే సీఎం అయ్యేవారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు.
అదే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే అని ఆల్మోస్ట్ తేలిపోయాక సీఎం కుర్చీ కోసం ఎందరో సీనియర్ నేతలు ఎగబడ్డారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఒకరు. పార్టీ కోసం మొదటి నుంచి ఎంతో కష్టపడి పనిచేసిన ఆయన్ను తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తే తప్పేముంది అనే చర్చ కూడా వచ్చింది. కానీ కాంగ్రెస్ మాత్రం ముందుగానే తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ అయిన రేవంత్ రెడ్డికే (Revanth Reddy) ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంపై చాలా మంది కుళ్లుకున్నారు కూడా. కానీ పై పైకి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం.. పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో చేస్తాం.. ఎవర్ని సీఎం చేసినా వారికి పూర్తి మద్దతు తెలుపుతాం అని అన్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతానికి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి అవుతారు అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్ర ఎందుకు అవుతారు అనేగా మీ సందేహం? ఏమీ లేదండీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమాని ఒకరు తన నివాసం వద్ద ఉత్తమ్‌కు సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు పోస్టర్లు వేయించారు.
దానిపై నేడు మంత్రి రేపు ముఖ్యమంత్రి అని రాయించడం వైరల్‌గా మారింది. దాంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్‌తో ఒప్పుకుని రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించకుంటారేమో అన్న చర్చ మొదలైపోయింది. పార్టీ వర్గాలకు కూడా తెలీకుండా ఉత్తమ్ పావులు కదుపుతున్నారని అందరూ అనుకుంటున్నారట.
ఇది జస్ట్ టాక్ మాత్రమే. ఒకవేళ అదే జరిగితే మాత్రం భట్టి విక్రమార్కతో పాటు ఇతర సీనియర్ నేతలు హర్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆల్మోస్ట్ కన్ఫామ్ అవుతున్న సమయంలోనే భట్టికి ఏం తక్కువ అనే టాక్ నడిచింది. భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత 100కి 100 శాతం ఉంది. మరి మధ్యలో ఉన్నట్టుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డే కావాలని అలా ఫ్లెక్సీలు వేయించారేమో అనే టాక్ కూడా ఉంది. మరోపక్క ఎవరో అభిమాని ఉత్తమ్‌పై ప్రేమతో అలా ఫ్లెక్సీ వేయించుకుంటే దానికి ఇంత రాద్దాంతం అవసరమా కొందరు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.