Kohinoor Diamond: ఈ వ‌జ్రానికి నిజంగా శాపం ఉందా? మ‌ర‌ణం త‌ప్ప‌దా?

Kohinoor Diamond: కోహినూర్.. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన విలువైన వ‌జ్రం. 105.6 క్యారెట్ వ‌జ్రం అయిన ఈ కోహినూర్ఇ ప్పుడు బ్రిట‌న్‌లోని బ‌కింగ్‌హామ్ ప్యాలెస్‌లో (Buckingham Palace) ఉంది. ఈ వజ్రాన్ని బ్రిట‌న్ మ‌హారాజు లేదా మ‌హారాణి కిరీటంలో ఉంటుంది. క్వీన్ ఎలిజ‌బెత్ (Queen Elizabeth) బతికి ఉన్నంత కాలం ఈ వ‌జ్రం ఉన్న కిరీటాన్ని ధ‌రించింది. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత చార్ల్స్ 111 మ‌హారాజ‌య్యారు. దాంతో ఆ కిరీటం ఆయ‌నకు ద‌క్కింది. అయితే ఈ కొహినూర్ వ‌జ్రానికి ఓ శాపం ఉంద‌ట‌. అదేంటంటే.. ఈ వ‌జ్రం ఉన్న కిరీటం ఎవ‌రి ద‌గ్గ‌రైతే ఉంటుందో వారు ఎక్కువ కాలం పాటు రాజుగా కొన‌సాగ‌లేరు. వారిని మ‌ర‌ణం వెంటాడుతుంటుంద‌ట‌.

కోహినూర్ క‌థేంటి?

ఈ కోహినూర్ వ‌జ్రాన్ని గోల్కొండ ప్రాంతంలోని కుల్లూరు మైన్స్‌లో క‌నుగొన్నారు. ఓ హిందూ దేవ‌త క‌న్ను రూపంలో ఈ కొహినూర్ వ‌జ్రం ఉండేది. 1310లో ఖిల్జీ వంశం ఆక్ర‌మించుకున్న త‌ర్వాత ఒక వంశం నుంచి మ‌రో వంశానికి ఈ వ‌జ్రాన్ని బ‌ద‌లాయిస్తూ వ‌చ్చారు. 1526లో కొహినూర్ బాబ‌ర్ చేతికి ద‌క్కింది. ఆ త‌ర్వాత‌ 1628లో షాజ‌హాన్ నెమ‌లి సింహాస‌నం త‌యారు చేయించుకుని దానికి కోహినూర్ వ‌జ్రాన్ని పెట్టించుకున్నారు. 1739లో ఢిల్లీని ఆక్ర‌మించుకున్న పెర్షియా రాజు నాద‌ర్ షా నెమ‌లి సింహాస‌నంతో పాటు కోహినూర్ వ‌జ్రాన్ని ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు ఈ వ‌జ్రం అఫ్గానిస్థాన్‌లో ఉంది. 1813లో మ‌హారాజా రంజిత్ సింగ్ అఫ్గాన్ దుర్రానీ వంశాన్ని అంతం చేయడంతో ఆ వ‌జ్రం తిరిగి భార‌త్‌కు వ‌చ్చింది. 1839లో రంజిత్ సింగ్ చ‌నిపోయాక బ్రిటిష్‌కి చెందిన ఈస్ట్ ఇండియా కెంపెనీ కోహినూర్‌పై స‌ర్వ హ‌క్కుల‌ను తీసేసుకుంది. ఇందుకోసం రంజిత్ సింగ్ 11 ఏళ్ల కుమారుడి నుంచి బ‌ల‌వంతంగా సంత‌కాలు కూడా చేయించుకుంది.

కోహినూర్ వ‌జ్రానికి ఉన్న శాపం ఏంటి?

కోహినూర్ వ‌జ్రం రాజుల వ‌ద్ద ఉంటే వారు త‌మ రాజ్యాన్ని, ప్రాణాల‌ను కోల్పోతార‌నే శాపం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ఖిల్జీ, మొఘ‌ల్, తుగ్ల‌క్, దుర్రానీ, రంజిత్ సింగ్ రాజ్యాలు కూలిపోవ‌డం.. ఆ రాజులు చ‌నిపోవ‌డ‌మే నిద‌ర్శ‌నం. వారి చేతికి కోహినూర్ వ‌చ్చిన త‌ర్వాతే వారు ఓడిపోయి చ‌నిపోవ‌డం జ‌రిగింది. ఈ శాపం గురించి బ్రిట‌న్ రాజ‌వంశ‌స్థుల‌కు తెలుసు కాబ‌ట్టే మ‌హారాణుల కిరీటంలోనే దీనిని పొదిగార‌ట‌. తొలిసారి కొహినూర్ వ‌జ్రాన్ని అలెగ్జాండ్రా మ‌హారాణి ధ‌రించారు. ఆ త‌ర్వాత విక్టోరియా మ‌హారాణి దానిని బ్రూచ్‌గా ధ‌రించారు. ఆ త‌ర్వాత విక్టోరియా త‌ల్లి దానిని ధ‌రించ‌గా.. 1953లో ఎలిజ‌బెత్ మ‌హారాణి 11 ధ‌రించారు. క్వీన్ ఎలిజ‌బెత్ చ‌నిపోయాక చార్ల్స్ 111 సింహాస‌నాన్ని అధిష్ఠించే స‌మ‌యంలో ఆయ‌న స‌హ‌చ‌రి అయిన క్యామిల్లా మాత్రం కోహినూర్‌ను ధ‌రించ‌లేదు.

ఇటీవ‌ల చార్ల్స్ 111కి క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు బ‌కింగ్‌హామ్ ప్యాలెస్ ప్ర‌క‌టించింది. దాంతో ఆయ‌న సింహాసనం అధిష్ఠించారు కాబ‌ట్టే కోహినూర్ శాపం ఆయ‌న‌కు త‌గిలింద‌ని అందుకే ఆయ‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. చార్ల్స్ కోహినూర్‌ని ధ‌రించ‌క‌పోయినా ప్ర‌స్తుతానికి బ్రిట‌న్ మ‌హారాజు ఆయ‌నే కాబ‌ట్టి కోహినూర్ అధిప‌తి కూడా ఆయ‌నే అవుతారు. సింహాస‌నాన్ని అధిష్ఠించిన అతి త‌క్కువ కాలానికే ఆయ‌న‌కు క్యాన్స‌ర్ సోక‌డంతో ఆ త‌ర్వాత రాజు ఎవ‌రు అనే చ‌ర్చ ఇప్ప‌టినుంచే మొద‌లైపోయింది. మ‌రోప‌క్క ఎప్ప‌టికైనా కోహినూర్‌ని భార‌త్‌కు తీసుకురావాల‌ని మ‌న ప్ర‌భుత్వం కూడా అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే కోహినూర్‌ని భార‌త్‌కు తీసుకురావ‌డం అంత చిన్న విష‌యం కాదు. దానిని భార‌త్‌కు తీసుకొచ్చి భ‌ద్రంగా ఎక్క‌డ‌న్నా దాచాలంటే అయ్యే ఖ‌ర్చు అంతా ఇంతా కాదు. అందుకే మ‌న నుంచి దోచుకున్న ఇత‌ర వ‌స్తువులనైనా భార‌త్‌కు తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.