Anti-Valentine’s Day: ప్రేమేనా.. కోపమూ చూపించాలిగా..!
Anti-Valentine’s Day: ప్రస్తుతం వ్యాలెంటైన్స్ వీక్ (Valentine Week) నడుస్తోంది. నిన్న రోజ్ డే అయిపోయింది. ఈరోజు ప్రపోజ్ డే అట. ఇలా 14వ తేదీ వరకు వ్యాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఈ వారం రోజుల పాటు ప్రేమికులు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పుకుంటూ కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. కేవలం ప్రేమ చూపించేందుకే ఈ వ్యాలెంటైన్ వీక్. మరి యాంటీ వ్యాలెంటైన్ వీక్ గురించి విన్నారా? వ్యాలెంటైన్స్ వీక్, వ్యాలెంటైన్ వీక్ గురించే మనం విన్నాం. కానీ వ్యాలెంటైన్స్ డే తర్వాతి వారం పాటు యాంటీ వ్యాలెంటైన్ వీక్ అనేది మొదలవుతుందని చాలా మందికి తెలీదు. అసలు ఈ యాంటీ వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటో తెలుసుకుందాం.
వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటి?
ఫిబ్రవరి 14న వ్యాలెంటైన్స్ డే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాలెంటైన్ వీక్ అనేది వారం రోజులు ఉంటుంది. ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14తో ఈ వ్యాలెంటైన్ వీక్ ముగుస్తుంది.
ఫిబ్రవరి 7 – రోజ్ డే
ఫిబ్రవరి 8 – ప్రపోజ్ డే
ఫిబ్రవరి 9 – చాక్లెట్ డే
ఫిబ్రవరి 10 – టెడ్డీ డే
ఫిబ్రవరి 11 – ప్రామిస్ డే
ఫిబ్రవరి 12 – హగ్ డే
ఫిబ్రవరి 13 – కిస్ డే
ఫిబ్రవరి 14 – వ్యాలెంటైన్స్ డే
యాంటీ వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటి?
వ్యాలెంటైన్ వీక్‌లో ఎలాగైతే భాగస్వామిపై ప్రేమను కురిపిస్తామో.. యాంటీ వ్యాలెంటైన్ వీక్‌లో ద్వేషం, కోపం వంటివి ఏవైనా ఉంటే తీర్చేసుకుంటారు. మరి ప్రేమను వెల్లడించినప్పుడు కోపాన్ని కూడా చూపించాలి కదా..! ఇద్దరు ప్రేమికుల మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. అలాగైతే అసలు బ్రేకప్‌లు కూడా జరగవు కదా..! మరి ఈ యాంటీ వ్యాలెంటైన్ వీక్‌లో ఏముంటాయంటే..
ఫిబ్రవరి 15 – స్లాప్ డే
స్లాప్ అంటే కొట్టడం. ఇద్దరు ప్రేమికులు ఒకరిపై ఒకరికి కోపం ఉంటే ఈ స్లాప్ డే రోజున ఒకరినొకరు కొట్టుకుంటారు. అంటే మీరు ఉన్న రిలేషన్‌షిప్‌లో మోసం తప్ప ప్రేమ లేదు అనిపిస్తే స్లాప్ డే రోజున మోసం చేస్తున్న మీ పార్ట్‌నర్ చెంప ఛెళ్లుమనిపించి ఆ బంధాన్ని ఎండ్ చేసేయండి.
ఫిబ్రవరి 16 – కిక్ డే
మీ పార్ట్‌నర్‌పై మీకు ఎప్పటినుంచో ద్వేషం, కోపం ఉందనుకోండి ఈ కిక్ డే రోజున తన్నుకుంటారు. ఇలా చేస్తే ఎన్నో రోజులుగా మనసులో ఉన్న భారమంతా ఒక్కసారిగా దిగిపోతుందట.
ఫిబ్రవరి 17 – పెర్ఫ్యూం డే
పెర్ఫ్యూం డే అంటే మీకు మీరే ఒక పెర్ఫ్యూంని గిఫ్ట్‌గా ఇచ్చుకోవడం. కానుకలు ఇతరులకు ఇవ్వడమే కాదు అప్పుడప్పుడూ మనకి మనం ఇచ్చుకోవాలిగా..!
ఫిబ్రవరి 18 – ఫ్లర్టింగ్ డే
సింగిల్‌గా ఉన్నవారు సరదాగా ఎవరితోనైనా ఫ్లర్ట్ చేయాలనుకుంటే ఈ ఫ్లర్ట్ డే రోజున చేస్తారట. అయితే ఆ ఫ్లిర్టింగ్ అనేది మితిమీరితే మన ఇండియాలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఫిబ్రవరి 19 – కన్ఫెషన్ డే
కన్ఫెషన్ డే అంటే మీ మనసులోని భావాలు, ఎమోషన్స్, కోపం, బాధ అన్నీ ఒకేసారి వెళగక్కడం. ఉదాహరణకు.. మీకు మీ పార్ట్‌నర్‌పై ఎప్పటినుంచో కోపం, ద్వేషం ఉన్నాయనుకోండి.. కానీ అది చూపించకుండా కేవలం ప్రేమిస్తున్నాను అని చెప్పుకుని తిరుగుతుంటే ఆ బంధానికి అర్థం ఉండదు. మీ మనసులో మీ భాగస్వామి పట్ల ఏముందో నిర్భయంగా చెప్పాలనుకుంటే ఈ కన్ఫెషన్ డే రోజున చెప్పేయచ్చు.
ఫిబ్రవరి 20 – మిస్సింగ్ డే
మీ పార్ట్‌నర్‌ను ఈ మిస్సింగ్ డే రోజున బాగా మిస్సవుతారన్న మాట. అంటే ఇది రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి కాదు. ఆల్రెడీ ప్రేమించుకుని కొన్ని కారణాల వల్ల దూరం అయినవారికి మాత్రమే వర్తిస్తుంది.
ఫిబ్రవరి 21 – బ్రేకప్ డే
ఫైనల్‌గా ఇక బంధాన్ని ముగించడమే బెటర్ అనుకునేవారికి ఈ బ్రేకప్ డే పనికొస్తుంది. ఒక బంధంలో ఉండి ఇద్దరూ నలిగిపోయే కంటే విడిపోయి సంతోషంగా ఉండటమే మంచిది అని మీకు అనిపిస్తే నిజాయతీగా మీ పార్ట్‌నర్‌కు అర్థమయ్యేలా చెప్పండి.