Horoscope Today: మీ ప్రేమ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి
Horoscope Today: రోజూ రాశిఫలాలు చూసుకుని తమ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. రాశి ఫలాల్లో ఇచ్చే పరిహారాలు, చిట్కాలు కూడా చాలా మంది కఠినంగా పాటిస్తుంటారు. ఈ వారం వ్యాలెంటైన్ వీక్ సందర్భంగా ఈ రోజు ప్రేమ విషయంలో అందరు రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం.
మేషం (Aries)
మీ భాగస్వామితో ఈరోజు మీకు వాదనలకు దిగుతారు. ఆ తర్వాత పరిస్థితులను అర్ధంచేసుకుని ఎందుకు గొడవపడ్డామా అని బాధపడతారు. అలాంటి సమయంలో మీరు మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పి బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి యత్నించాలి.
వృషభం (Taurus)
మీ భాగస్వామి ఈరోజు ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ వారు తమ ఎమోషన్స్‌ను బయటికి చూపించకుండా ఉంటారు. వారు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మీరే ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూ వారి బాధేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
మిథునం (Gemini)
ఈరోజు మీరు మీ భాగస్వామితో బయటికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలం పాటు వెళ్లకపోయి ఉంటే ఈరోజు తప్పకుండా వెళ్లండి. ఈ సమయం మీకు ఎంతో కీలకం. కుటుంబంలో ఆల్రెడీ కలహాలు ఉంటే ఈ సమయాన్నీ మీరు మీ భాగస్వామి బాగా ఉపయోగించుకోండి.
కర్కాటకం (Cancer)
ఈరోజు మీ భాగస్వామి గురించి మీకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. దాంతో మీరు వారిపై రెచ్చిపోయినట్లు ప్రవర్తిస్తారు. దాంతో మీ భాగస్వామి బాధతో బంధానికి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ప్రశాంతంగా ఆలోచించి నిదానంగా మాట్లాడాలి.
సింహం (Leo)
మీరు మీ భాగస్వామికి సరైన సమయం కేటాయించడంలేదని వారు అలిగే అవకాశం కనిపిస్తోంది. వారి అవసరాలను మీ వరకు రానివ్వకుండా చూసుకుంటారు. దాంతో ఇది గొడవలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో మాట్లాడే సమయంలో నిదానంగా ఆచి తూచి మాట్లాడితే గొడవ దానంతట అదే సర్దుకునే అవకాశం ఉంది.
కన్య (Virgo)
మీరు ఈరోజు మీ భాగస్వామితో వింతగా ప్రవర్తించడం వంటివి చేయకండి. కారణం ఏదేమైనప్పటికీ మీరు ఇలా ప్రవర్తిస్తే బ్రేకప్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి. వారి ఐడియాలను అర్థంచేసుకునేందుకు యత్నించండి. అప్పుడు వారు కూడా మీతో విభిన్నంగా ప్రవర్తిస్తారు.
తుల (Libra)
మీరు ఎప్పటినుంచో మీ భాగస్వామి నుంచి వినాలనుకున్నది ఈరోజు వింటారు. దానికి మీరు ఇచ్చే సమాధానంతో కూడా మీ భాగస్వామి సంతోషిస్తారు. ఆ తర్వాత మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio)
ఈరోజు మీకు మీ భాగస్వామితో బ్రేకప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా వినండి. వారు మిమ్మల్ని మోసం చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు చెప్పింది గుడ్డిగా నమ్మేయకండి.
ధనుస్సు (Sagittarius)
ఈరోజు మీ భాగస్వామితో మీరు మర్చిపోలేని సమయాన్ని గడుపుతారు. మీరు ఈరోజు మీ గతం గురించి భాగస్వామితో పంచుకుంటారు.
మకరం (Capricorn)
మీరు మీ భాగస్వామితో ఫ్యామిలీని ప్లాన్ చేసుకునే సమయం వచ్చింది. దాని గురించే ఈరోజు చర్చిస్తారు. మీరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఇద్దరి మధ్య పాజిటివిటీని నింపుతాయి. సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు.
కుంభం (Aquarius)
మీ రొమాంటిక్ జీవితంలో సమస్యలు వచ్చేలా ఉన్నాయి. మీ భాగస్వామి మీ గురించి తప్పుడు మాటలు వినే అవకాశం ఉంది. దాని వల్ల ఇద్దరి వల్ల గొడవలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు కూడా వారితో గొడవపడకుండా జాగ్రత్తగా సామరస్యంగా విషయాన్ని డీల్ చేయాలి.
మీనం (Pisces)
మీ భాగస్వామి ఈరోజు మీతో మీ కుటుంబంతో గుడ్ న్యూస్ పంచుకుంటారు. అది విని మీరు సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఈరోజు మీ పార్ట్నర్ మీ చుట్టూనే తిరుగుతూ బోలెడంత ప్రేమ కురిపిస్తారు.