Indians Dying In USA: మ‌న విద్యార్ధుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారా?

Indians Dying In USA: అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయ విద్యార్ధుల మ‌ర‌ణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదుగురు భార‌తీయ విద్యార్ధులు దుర్మ‌ర‌ణం చెందారు. దాంతో అమెరికాకు వెళ్లాల‌ని క‌ల‌లు కంటున్న భార‌తీయ విద్యార్ధుల‌కు బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెల‌ల్లో ఐదుగురు భార‌తీయ విద్యార్ధులు అమెరికాలో మ‌ర‌ణించారంటే అక్క‌డ ఏదో జ‌రుగుతోంద‌ని అనుమానించాల్సిందే. కావాల‌ని భార‌తీయుల‌ను టార్గెట్ చేసి చంపేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇండియానాలో 23 ఏళ్ల స‌మీర్ కామ‌త్ అనే భార‌తీయ విద్యార్ధి హ‌త్య‌కు గుర‌య్యాడు.

స‌మీర్ మృత‌దేహం ఈ నెల 5న ఓ అడ‌వి ప్ర‌దేశంలో ల‌భ్య‌మైంది. 2023లో మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈలోగా అత‌ను మిస్స‌య్యాడు. అక్క‌డి పోలీస్ అధికారులు స‌మీర్ కోసం వెతుకుతుండ‌గా.. ఇండియానాలోని ఓ అడ‌వి మార్గంలో శ‌వ‌మై క‌నిపించాడు. దాంతో స‌మీర్ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ప‌ర్ద్యూ యూనివ‌ర్సిటీలో స‌మీర్ డాక్ట‌రేట్ పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగా ఇలా శ‌వ‌మై వ‌స్తాడ‌ని ఆ కుటుంబం ఊహించ‌లేక‌పోయింది.

అమెరికాలో చ‌నిపోయిన భార‌తీయ విద్యార్ధులు వీరే

ఈ ఏడాది జ‌న‌వ‌రి 28న నీల్ ఆచార్య అనే విద్యార్ధి అమెరికాలో క‌నిపించ‌కుండాపోయాడు. అత‌ని కోసం గాలిస్తుండ‌గా మృత‌దేహం దొరికిన‌ట్లు అత‌ను విద్య‌న‌భ్యసిస్తున్న యూనివ‌ర్సిటీ అధికారులు మీడియా ద్వారా వెల్ల‌డించారు. నీల్ ఎలా చ‌నిపోయ‌డు అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. అక్క‌డి అధికారులు ఈ కేసును టేక‌ప్ చేసి విచారిస్తున్నారు. నీల్ ఆచార్య కూడా స‌మీర్‌లాగే ప‌ర్ద్యూ యూనివర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్ అండ్ డేటా సైన్స్‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్నాడు. దాంతో నీల్ మృతికి.. స‌మీర్ మృతికి ఏమ‌న్నా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

ఇటీవ‌ల అమెరికాలో ఉంటున్న భార‌తీయ విద్యార్ధిపై స్థానిక వ్య‌క్తి దాడి చేసి చంపిన ఘ‌ట‌న సీసీటీవీలో రికార్డ్ అవ్వ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. జార్జియాలోని లిథోనియాలో ఉంటున్న వివేక్ సైనీ అనే MBA విద్యార్ధిని స్థానిక నివాసి అయిన జులియ‌న్ ఫాక్న‌ర్ అనే వ్య‌క్తి దాడి చేసి చంపేసాడు. సుత్తితో వివేక్ త‌ల‌పై దాదాపు 50 సార్లు కొట్టి చంపిన‌ట్లు సీసీటీవీలో క‌నిపించింది. సుత్తితో వివేక్ త‌ల‌పై దాదాపు 50 సార్లు కొట్టి చంపిన‌ట్లు సీసీటీవీలో క‌నిపించింది. స్థానిక క్లీవ్‌ల్యాండ్ రోడ్డులో వివేక్ పార్ట్ టైం క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తుండేవాడు. జ‌న‌వ‌రి 16న జులియ‌న్ అనే వ్యక్తి వివేక్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఉచితంగా ఆహారం కావాల‌ని అడిగాడు. ఇందుకు వివేక్ ఒప్పుకోలేదు. దాంతో వివేక్‌ని వెంబడించి మ‌రీ చంపేసాడు.

ఆ త‌ర్వాత ఘ‌ట‌న‌లో 19 ఏళ్ల శ్రేయ‌స్ అనే కుర్రాడు ఒహాయోలో మృతిచెందాడు. ఇత‌ని మృత‌దేహం అత‌ను చ‌దువుతున్న యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ల‌భించింది. ద్వేష‌పూరిత దాడి వ‌ల్లే శ్రేయ‌స్ చనిపోయి ఉంటాడ‌ని అక్క‌డి పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌రో ఘ‌ట‌న‌లో జ‌న‌వ‌రి 20న అకుల్ ధావ‌న్ అనే విద్యార్ధి ఇల్లినోవాలోని యూనివర్సిటీలో హ‌త్య‌కు గుర‌య్యాడు.  పోస్ట్‌మార్టెం నిర్వ‌హించ‌గా అకుల్ హైపోథ‌ర్మియా వ‌ల్ల చ‌నిపోయాడ‌ని తేలింది.

చికాగోలో హైద‌రాబాద్ వ్య‌క్తిపై దాడి

ఈరోజు జ‌రిగిన ఘ‌ట‌న‌లో చికాగోలో ఉంటున్న స‌య్య‌ద్ మ‌జ‌హీర్ అలి అనే హైద‌రాబాదీ యువ‌కుడు ర‌క్త‌పు మ‌డుగుల్లో ప‌రిగెత్తుతూ సీసీటీవీలో క‌నిపించ‌డం వైర‌ల్‌గా మారింది. కొంద‌రు దొంగ‌లు అత‌న్ని త‌రుముతూ వెళ్తుంటే అత‌ను కాపాడండి అంటూ అరుచుకుంటూ వెళ్తున్న‌ట్లు వీడియోలో క‌నిపించింది. అలీ భార్య త‌న భ‌ర్త‌ను కాపాడాల‌ని విదేశాంగ కార్యాల‌యానికి రిక్వెస్ట్ పెట్టింది. త‌న భ‌ర్త‌ను చూసుకునేందుకు త‌న‌ను త్వ‌ర‌గా అమెరికా పంపించాల‌ని కోరింది.

ఇలా అమెరికాలో భార‌తీయ విద్యార్ధులు అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోతుండ‌డంతో కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంట్‌లో త‌మ వాద‌న‌లు వినిపించారు. ఈ మ‌ర‌ణాల‌పై భార‌త్ క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. 2018 నుంచి చూసుకుంటే అమెరికాలో దాదాపు 418 మంది భార‌తీయులు అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయార‌ని గుర్తుచేసారు,