Company Rules: ఇక బాస్‌కి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు

Company Rules: సాధారణంగా ఒక‌రి కింద ప‌నిచేస్తున్నామంటే వారు చెప్పిన‌ట్లే విని న‌డుచుకోవాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం మ‌న‌కు ముఖ్యం కాబ‌ట్టి. కొంద‌రు మ‌రీ నాటుగా ఉంటారు. బాస్ ఒక‌ మాటంటే అస్స‌లు ప‌డ‌రు. నేనేమ‌న్నా నీ కింద బానిస అనుకున్నావా అని రిజైన్ చేసి వెళ్లిపోతుంటారు. లేదా మెల్లిగా వేరే ఉద్యోగాన్ని వెతుక్కుని జంప్ అయిపోతారు. (Company Rules)

అయితే ఇప్పుడు వేరే ఉద్యోగాన్ని వ‌దిలి వెళ్లిపోవ‌డాలు.. బాస్‌తో గొడ‌వేసుకోవ‌డాలు మ‌న భార‌త‌దేశంలో అయితే అంత‌గా జ‌ర‌గ‌డంలేదు. ఈరోజుల్లో ఎవ‌రి ఆర్ధిక ప‌రిస్థితి కూడా అంత‌గా బాగుండ‌టం లేదు. చ‌చ్చిన‌ట్లు ఉద్య‌గోం చేయాల్సిందే..! న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా. కొన్నిసార్లు మ‌నం సెల‌వుల్లో ఉన్నా మ‌న‌కు వీకాఫ్ ఉన్నా కూడా బాస్ నుంచి ఫోన్ కాల్స్ వ‌స్తుంటాయి. ఉద్యోగం అవ‌స‌రం కాబ‌ట్టి చ‌చ్చిన‌ట్లు ఫోన్ కాల్స్ అటెండ్ అవుతాం. మ‌రీ అర్జెంట్ ఉంటే సెల‌వులు క్యాన్సిల్ చేసుకుని కూడా రావాల్సి ఉంటుంది.

అయితే ఒక దేశంలో మాత్రం సెలవు స‌మయంలో లేదా ఉద్యోగి బ్రేక్‌లో ఉన్న స‌మ‌యంలో బాస్ నుంచి ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వ‌స్తే అటెండ్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు అని కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. ఆహా.. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది క‌దూ..! ఈ రూల్ మ‌న దేశంలో రాలేదులేండి. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం దీనిని ప్ర‌వేశ‌పెట్టింది. ఉద్యోగులు త‌మ బ్రేక్‌ టైంలో ఉన్న‌ప్పుడు బాస్ నుంచి కాల్స్ వ‌స్తే లిఫ్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈ రూల్‌ని ఉల్లంఘించి వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం వంటివి చేస్తే కంపెనీపైనే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గ‌ట్టిగా చెప్పింది. (Company Rules)

బ్రేక్‌, లీజ‌ర్ టైం అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఉండాల‌ని.. అలా ఉంటేనే ప్రొడ‌క్టివిటీ బాగుంటుంద‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో అయితే ఉద్యోగులు త‌మ బ్రేక్ టైంలో ఆఫీస్‌కి సంబంధించిన అన్ని ప‌రిక‌రాల‌ను స్విచ్ఛాఫ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పాయి. ఒక‌వేళ ఓవ‌ర్ టైం చేస్తూ త‌గిన వేతనం ఇవ్వ‌క‌పోతే కూడా ఆ కంపెనీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఒక కంపెనీలో ప‌నిచేస్తున్న ఉద్యోగి 24 గంట‌లూ ప‌నిచేయ‌డం లేదు అని వారిని లీజ‌ర్ టైంలో బ్రేక్ టైంలో డిస్ట‌ర్బ్ చేయ‌డం.. 24 గంట‌లు ప‌నిచేయ‌డంలేదు క‌దా అని ప‌ని గంట‌ల‌కు మాత్ర‌మే జీతం ఇస్తాం అన‌డం ఎంత మాత్రం స‌బ‌బు కాద‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తెలిపింది. ఇలా చేస్తే ఉద్యోగుల‌ హక్కుల‌ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని పేర్కొంది. (Company Rules)

ఈ చ‌ట్టానికి సంబంధించిన బిల్లుని స్థానిక పార్ల‌మెంట్‌లో వ‌చ్చే వారం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లుపై కొన్ని కంపెనీలు, రాజ‌కీయనేత‌లు అభ్యంత‌రం తెలిపారు. ఇలాంటి బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టి వ‌ర్క‌ర్ల‌కు ఇలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తే పోటీత‌త్వం అనేది లేకుండాపోతుంది అంటున్నారు. ఆస్ట్రేలియాలో వ‌ర్క‌ర్లు ఏటా ఆరు వారాల పాటు ఓవ‌ర్ టైం డ్యూటీ చేస్తుంటారు. అలా ఓవ‌ర్ టైం చేసినందుకు వారికి అద‌నంగా ఎలాంటి వేత‌నాలు ఇవ్వ‌డంలేదు.

అంటే.. వ‌ర్క‌ర్ల చేత ఓవ‌ర్ టైం చేయించుకుని కంపెనీలు ఎగ్గొడుతున్న మొత్తం అక్ష‌రాలా 92 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు. ఓవ‌ర్ టైం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆ ఓవ‌ర్ టైం అనేది వ‌ర్క‌ర్ల‌కు లీజ‌ర్ స‌మ‌యంగా ఉండాలి కానీ అప్పుడు కూడా వారి చేత ప‌ని చేయించుకుని వేత‌నాలు ఇవ్వ‌కుండా ఎగ్గొట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ వింగ్ గ్రీన్స్ అనే పార్టీ అధినేత ఆడ‌మ్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. వ‌ర్క‌ర్ల‌కు ఫ్రీ టైం ఉండాలి అనే బిల్లును ప్ర‌వేశ‌పెట్టేలా చేసింది ఈ లెఫ్ట్ వింగ్ గ్రీన్స్ పార్టీనే. ఎట్ట‌కేల‌కు బిల్లు పార్ల‌మెంట్‌లో పాస్ చేయ‌బోతున్నందుకు వారు హ‌ర్షం వ్య‌క్తం చేసారు. (Company Rules)