YS Sharmila: అన్న‌ను అడిగితే అలా చెప్పారు.. నిజ‌మేనా?

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ బాప‌ట్లలో (bapatla) నిర్వ‌హించిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (ap elections) ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని ష‌ర్మిళ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం త‌న అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) కూడా లెక్క చేయడంలేదు. (YS Sharmila)

“” బాప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఈ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తోంది. ఇందాక వ‌స్తుంటే బాప‌ట్ల‌కు సంబంధించి ఒక అన్న‌తో మాట్లాడాను. ఏమ‌న్నా ఎలా ఉంది బాప‌ట్ల అని అడిగాను. దాంతో అన్న అన్నాడు.. అమ్మా మీ నాన్న ఉన్న‌ప్పుడ కేవ‌లం బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గానికి రూ.1400 కోట్లు సాంక్ష‌న్ అయ్యింది త‌ల్లీ.. ఆరోజుల్లో ఎన్నో అభివృద్ధి ప‌నులు జ‌రిగాయి ఆ త‌ర్వాత వ‌చ్చిన తెలుగు దేశం, YCP వాల్ల కానీ ఏ ప‌నులు జ‌ర‌గ‌లేదు అన్నారు.

ఆరోజుల్లో ఏ రోడ్లు వేసారో అవే రోడ్లు, నీటి సౌక‌ర్యాలు ఉన్నాయి. ఇంకా ప‌రిస్థితి దీనం అయ్యింది త‌ప్ప మెరుగైన‌ది లేదు అన్నారు. కొన్ని చోట్ల తాగ‌డానికి కూడా నీళ్లు లేవు… YSR ఉన్న‌ప్పుడు డెల్టా ప‌నులు మొద‌లుపెట్టారు.. ఆ ప‌నులు పూర్త‌య్యుంటే పంట‌ల‌కు నీళ్లొచ్చేవి ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు అన్నారు. మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అని అడిగితే చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ప‌ట్టించుకోవడం లేదు అన్నారు. ఎందుక‌న్నా అని అడిగితే.. ఇక్క‌డున్న అధికార ప‌క్షం నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పారు. నిజ‌మేనా? (YS Sharmila)

మీరే చెప్పాలి. మీ నియోజ‌క‌వ‌ర్గం క‌దా..! మీ గురించి ప‌ట్టించుకుంటున్నారా లేక వారు బిజీగా ఇసుక మాఫియాలు చేసుకుంటున్నారా? క‌నీసం జ‌నాల‌కు మోడ్ర‌నైజేష‌న్ కాదు క‌దా ఉన్న క‌ట్ట‌లు కూడా కూల‌గొట్టి ఆ ఇసుక‌ను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. అది నిజ‌మేనా? ఇదేం ప‌రిస్థితి అన్నా అని అడిగాను. మ‌రి వీరంతా రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి కోసం నిల‌బ‌డుతున్నాం అని ఆయ‌న ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు క‌దా అన్నా.. అని అడిగాను.  ఎక్క‌డ రాజ‌శేఖ‌ర్ రెడ్డ‌మ్మా.. ఇక్క‌డి నాయ‌కులే రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి విగ్ర‌హం ఎక్క‌డ పెట్టారు? పెడ్తాం అంటే ఆయ‌న విగ్ర‌హం పెట్ట‌డానికి స్వ‌యంగా YCP నాయ‌కులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మ‌రి ఇదేనా రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి ఆశ‌యాల‌ను నెర‌వేర్చ‌డం అంటే..? ఎలా ఉండేది ఆయ‌న సంక్షేమ పాల‌న‌? ఆయ‌న పాల‌నలో రైతే రాజు. ఆయ‌న పాల‌న‌లో వ్య‌వ‌సాయం పండుగ‌.

ఈరోజుల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉంటే రైతుల‌కు రుణ‌మాఫీ, వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకున్నారు. రైతుల కోసం పెట్టుబ‌డి ధ‌ర‌లు త‌గ్గించి వ‌చ్చే రాబ‌డిని రెట్టింపు చేసారు. ఆయ‌న ఉన్న‌ప్పుడు ఇన్పుట్ స‌బ్సిడీ ఉంది. విత్త‌నాల‌పై స‌బ్సిడీ ఉంది. పంట న‌ష్ట‌పోతే అద్భుతంగా న‌ష్ట‌ప‌రిహారం ఉంది. ఇప్పుడుందా ఆ ప‌రిస్థితి? ఇప్పుడు క‌నీసం పంట పండిస్తేనే గిట్టు బాటు ధ‌ర రాదు. పంట న‌ష్ట‌పోతేనేమో క‌నీసం బీమా కూడా రాదు. క‌నీసం న‌ష్ట‌ప‌రిహారం కూడా ఇవ్వ‌ని ప్ర‌భుత్వం జ‌గ‌న్ అన్న గారి ప్ర‌భుత్వం. మ‌రి ఏమ‌నాలి? ఇదేనా రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఆశ‌యాల‌ను నెరవేర్చ‌డం అంటే? ఆయ‌న ప‌రిపాల‌న ఎక్క‌డ జ‌గ‌న‌న్న పాల‌న ఎక్క‌డ‌? (YS Sharmila)

రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు విద్యార్ధుల చ‌దువు కోసం డ‌బ్బు లేని కార‌ణంగా ఏ బిడ్డా చ‌దువు ఆగిపోకూడ‌ద‌ని ఓ మాట‌నేవారు. మీరు ఏది కావాలంటే అది చ‌దువుకోండి… మీరు ఏమ‌వ్వాల‌నుకున్నా అది చ‌దువుకోండి ప్ర‌భుత్వ‌మే ఉచితంగా చ‌దివిస్తుంది అన్నారు. అది ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్. ఆయ‌న ఉన్న‌ప్పుడు ఎంత మంది పేద బిడ్డ‌లు డాక్ట‌ర్లు, ఇంజినీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు ల‌క్ష‌ణంగా చ‌దువుకున్నారు. ఈరోజు వారు ల‌క్ష‌ణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ లేదు. కూలి నాలి చేసుకుని త‌ల్లిదండ్రులే వారి పిల్ల‌ల కోసం అప్పులు చేసి చ‌దివిస్తున్నారు. చ‌దువుకున్నాక క‌నీసం ఉద్యోగాలు కూడా లేవు “” అంటూ చెల‌రేగిపోయారు ష‌ర్మిళ‌