Esha Deol Divorce: హేమమాలిని కూతురి విడాకులు.. అసలు ఏం జరిగింది?
Esha Deol Divorce: డ్రీమ్ గర్ల్ హేమమాలిని (hema malini) కూతురు, నటి ఇషా డియోల్.. (esha deol) తన భర్త భరత్ తక్తానీతో (bharat Takhtani) విడిపోయారు. ఎప్పటినుంచో వీరు విడిపోతున్నారు అని టాక్ వినిపిస్తున్నప్పటికీ రూమర్స్ అనుకున్నారు కానీ అది నిజమే అని ఇషా ప్రకటించారు. దేవుడి దయ వల్ల తన ఇద్దరు ఆడపిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లాపాపలతో వారు సంతోషంగా ఉన్నారు అని హేమమాలిని చెప్పిన కొద్ది రోజులకే తన పెద్ద కూతురి కాపురం ఇలా అయిపోతుందని ఆమె ఊహించలేకపోయింది. (esha deol divorce)
అసలు ఏం జరిగింది?
ఇషా డియోల్, భరత్‌లది పెద్దలు కుదిర్చిన వివాహమే. దాదాపు 12 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. 2012లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. వీరి వివాహం గ్రాండ్‌గా పెద్ద హోటల్‌లో ఏమీ జరగలేదు. సింపుల్‌గా ఇస్కాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా అంతా బాగానే ఉంది. సమస్య రెండో ఆడపిల్ల పుట్టినప్పుడే వచ్చిందట. రెండో పాప పుట్టగానే భరత్ తనను ఇషా అసలు పట్టించుకోవడంలేదు అనుకున్నాడట. ఈ విషయాన్ని ఇషా తాను రాసిన అమ్మా మియా అనే పుస్తకంలో పేర్కొన్నారు.
“” నా రెండో కూతురు పుట్టాక భరత్‌లో చాలా మార్పులు గమనించాను. భరత్ ఏదీ నోరు విప్పి చెప్పడు. తన ప్రవర్తనతోనే అన్నీ అర్థమైపోతాయి. రెండో కూతురు పుట్టాక నేను నా పెద్ద కూతురు స్కూలింగ్.. నా పుస్తకం రాయడం.. ఇతర ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయాను. కనీసం భరత్‌తో ఒక గంట పాటు మాట్లాడే సమయం కూడా ఉండేది కాదు. ఓసారి భరత్ నన్ను కొత్త టూత్ బ్రష్ కావాలి అని అడిగినప్పుడు నేను తనకు సమయం కేటాయించడంలేదని.. తన గురించి బొత్తిగా పట్టించుకోవడంలేదని అర్థమైపోయింది. (esha deol divorce)
భరత్ లంచ్‌కి ఏం తీసుకెళ్తున్నాడు? ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుంటున్నాడా లేదా వంటి అంశాలను పట్టించుకోవడం మానేసా. ఇదొక్కటే కాదు. నేను తనతో డిన్నర్‌కి కానీ డేట్ నైట్‌కి కానీ వెళ్లడం కుదిరేది కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా నీట్‌గా మంచి దుస్తులు వేసుకుని కాకుండా ఏదో పైజామా వేసుకుని జుట్టు విరబూసుకుని వెళ్లిపోతుండేదాన్ని. అది భరత్‌కు మింగుడుపడలేదు. నేను తనకు సరైన సమయం కేటాయించలేకపోతున్నానన్న విషయం భరత్ జీర్ణించుకోలేకపోయాడు. కానీ నేను మాత్రం ఏం చేయగలను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వారిని నేను దగ్గరుండి చూసుకోవాలి “” అని తన పుస్తకంలో రాసుకొచ్చారు ఇషా.
ఇషా విడాకుల అంశాన్ని హేమమాలిని, ధర్మేంద్రలు జీర్ణించుకోలేకపోతున్నారట. పైకి మాత్రం మీ జీవితాలు మీ ఇష్టం అంటున్నారు కానీ లోపల మాత్రం సర్దుకుని ఉండకూడదా అని బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వయసులో పిల్లా పాపలతో బిడ్డలు సంతోషంగా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వారి కళ్ల ముందే పచ్చని సంసారం మంటల్లో కాలి బూడిదైపోతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం తట్టుకోగలరు? ఎంత డబ్బున్నవారైనా సినీ నటులైనా వాళ్లూ మనుషులేగా..! (esha deol divorce)
అయితే విడాకుల తర్వాత కూడా ఇషా తన సోషల్ మీడియా నుంచి మాజీ భర్తతో కలిసి దిగిన అపురూపమైన ఫోటోలను మాత్రం డిలీట్ చేయలేదు. వాటిని డిలీట్ చేసేంత కోపం కక్ష ఒకరిపై ఒకరికి లేవని తెలిపారు. అయితే ఇప్పుడు ఇషా డియోల్ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలనుకుంటున్నారట. ఇందుకు తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. తమిళంలో వచ్చిన యువ సినిమాలో ఇషా డియోల్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఇషాను అందరూ ధూమ్ గర్ల్‌గానే గుర్తుపెట్టుకున్నారు. ధూమ్ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాలో ఇషా హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఇషా సినీ కెరీర్ ఏమీ పెద్దగా ఊపందుకోలేదు.