Venkatesh Netha: ఎన్నిక‌ల‌కు ముందుకు కేసీఆర్‌కు బిగ్ షాక్

Venkatesh Netha: లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో BRS పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. BRS ఎంపీ వెంక‌టేష్ నేత రాజీనామా చేసారు. త్వ‌ర‌లో కేసీ వేణుగోపాల్‌ను క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌రిగ్గా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో BRS నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తున్న తొలి సిట్టింగ్ ఎంపీ ఈయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. (Venkatesh Netha)

ఎంపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో తెలంగాణ మాజీ సీఎం KCR, BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTRలు క‌లిసి త‌మ నియోజక‌వ‌ర్గాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో వెంక‌టేష్ నేత రాజీనామా చేయ‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతానికి వెంక‌టేష్ నేత పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా ఉన్నారు. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయన 95 వేల ఓట్ల‌తో గెలిచారు.

మంచి పేరు ఉన్న వెంక‌టేష్ నేత స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పార్టీని వీడ‌టం BRS పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసి అధికారాన్ని కోల్పోయిన ఇప్పుడు ఎలాగైనా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందుకోస‌మే తుంటి ఎముక శ‌స్త్ర చికిత్స అనంత‌రం పూర్తిగా కోలుకోక‌పోయిన‌ప్ప‌టికీ KCR బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నారు. మ‌రోప‌క్క KTR ఆల్రెడీ అపోషిజ‌న్‌పై బ్యాటింగ్ మొద‌లుపెట్టేసారు. (Venkatesh Netha)

ఇటీవ‌ల తాటికొండ రాజ‌య్య కూడా రాజీనామా చేసారు. ఆయ‌న‌కు మొన్న తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న సీటును కడియం శ్రీహ‌రికి ఇవ్వ‌డంతో ఆయ‌న చాలా బాధ‌ప‌డ్డారు. అంబేడ్కర్ విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న పాదాల‌పై ప‌డి మ‌రీ ఏడ్చారు. KCR క్యాబినెట్‌లో రాజ‌య్య తొలి డిప్యూటీ సీఎంగా ప‌నిచేసారు. ఆయ‌న కూడా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు రాజీనామా చేయ‌డంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది.  (Venkatesh Netha)