UCC అంటే ఏంటి? దీని వ‌ల్ల మ‌న‌కు ఉప‌యోగం ఏంటి?

UCC: ఇప్పుడు యావ‌త్ భార‌త‌దేశం UCC గురించే చ‌ర్చించుకుంటోంది. UCC అంటే యూనిఫాం సివిల్ కోడ్. తెలుగులో ఉమ్మ‌డి పౌర‌స్మృతి అంటారు. అంటే కులం, మ‌తం ఏదైన‌ప్ప‌టికీ అంద‌రికీ చ‌ట్టం ఒకేలా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ UCCని భార‌త‌దేశంలో అమ‌లు చేయాల‌ని చూస్తోంది.

UCC అంటే ఏంటి?

మ‌న భార‌త‌దేశంలో ఎన్నో మ‌తాలు, కులాలు ఉన్నాయి. కానీ చ‌ట్టం మాత్రం అంద‌రికీ ఒకటేలా లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఇస్లాంలో భార్య‌కు భ‌ర్త విడాకులు ఇవ్వాలంటే మూడు సార్లు త‌లాక్ అని చెప్తే స‌రిపోతుంది. కానీ మ‌న సంప్ర‌దాయం ప్ర‌కారం కోర్టును ఆశ్ర‌యించి నోటీసులు ఇవ్వ‌డం ఆ త‌ర్వాత ఇరువైపుల వాదోప‌వాదాలు విన‌డం వంటి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలా ఒక్కో మ‌తానికి ఒక్కో చ‌ట్టం కాకుండా.. ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లు ప‌రిస్తే అంద‌రికీ ఒకే చ‌ట్టం వ‌ర్తించేలా ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

ఏ రాష్ట్రం UCCని అమ‌లు చేసింది?

ప్ర‌స్తుతానికి అయితే ఉత్త‌రాఖండ్ రాష్ట్రం మాత్ర‌మే ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లును అనుమిస్తూ బిల్ పాస్ చేసింది. దీని వ‌ల్ల ఉత్త‌రాఖండ్‌లో నివ‌సిస్తున్న ముస్లింలు ఒక‌టికి మించి ఎక్కువ పెళ్లి చేసుకోవ‌డం కుద‌ర‌దు. స‌హ‌జీవ‌నం చేయాల‌నుకుంటే క‌చ్చితంగా అందుకు కావాల్సిన అనుమ‌తులు తీసుకోవాల‌ని ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం పేర్కొంది.

UCC అమ‌లైతే లాభాలేంటి?

UCC ఇస్లాంకు ఉన్న స‌ప‌రేట్ చ‌ట్టాన్ని తొల‌గించేస్తుంది కాబ‌ట్టి ముస్లిం మ‌హిళ‌ల‌కు విడాకుల త‌ర్వాత భ‌ర్త‌ల నుంచి మెయింటైనెన్స్ ల‌భిస్తుంది. పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్లు, స‌హ‌జీవ‌నానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్లు త‌ప్ప‌కుండా చేసుకోవాల్సిందే. ఈ ఉమ్మ‌డి పౌర‌స్మృతి చ‌ట్టం ప్ర‌కారం.. భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు ప‌రిహారం ల‌భిస్తుంది. అంతేకాదు.. భ‌ర్త త‌ల్లిదండ్రుల‌ను చూసుకునే బాధ్య‌త భార్య‌పైనే ఉంటుంది. ఒక‌వేళ భార్య వేరే పెళ్లి చేసుకుంటే ఆ ప‌రిహారం ఇరు కుటుంబాల‌తో పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్ర‌క్రియ అమ‌లు కావ‌డానికి ఎంత స‌మయం ప‌డుతుంది?

2022 మే నెల‌లో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం UCCని అమ‌లు చేసేందుకు ఒక ప్యానెల్‌ను నియ‌మించింది. దాదాపు 2.3 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లుపై త‌మ అభిప్రాయాల‌ను నివేదిక‌ల రూపంలో అందించారు. 2.3 ల‌క్ష‌ల మంది అంటే ఉత్త‌రాఖండ్‌లో ప‌ది శాతం కుటుంబాల‌తో స‌మానం. ఆ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం 72 స‌మావేశాలు ఏర్పాటుచేసి UCCని అమలు చేయాల‌ని డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది.

UCC వ‌ల్ల లాభాలేంటి? న‌ష్టాలేంటి?

భారతదేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మ్ర‌తి అమలు అనేది సంక్లిష్టమైన, వివాదాస్పదమైన అంశం. UCC సమానత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించే అంశ‌మే అయిన‌ప్ప‌టికీ , దాని సంభావ్య ప్రతికూలతలలో మైనారిటీ హక్కుల ఉల్లంఘ‌న‌లు, సాంస్కృతిక సున్నితత్వ, సామాజిక అశాంతిని క‌లిగించే న‌ష్టాలు కూడా ఉన్నాయి.