Revanth Warns Jagan: దమ్ముంటే ఇప్పుడు వచ్చి చూడు
Revanth Warns Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. (revanth reddy) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి (jagan mohan reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఇప్పుడు నాగార్జన సాగర్ దగ్గరికి జగన్ రావాలని.. అప్పుడు BRS ప్రభుత్వం ఉంది కాబట్టి సాగర్ దగ్గర ఏపీ పోలీసులు ఓవరాక్షన్ చేసారని రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్ ఇటు వైపు చూసే ధైర్యం కూడా చేయలేడని ఏకిపారేసారు.
అసలు ఏం జరిగింది?
తెలంగాణ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులకు మధ్య గొడవ జరిగింది. తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడకపోవడంతో ఓడిపోతున్నందుకు ఇలాంటి ఘటనలు సృష్టిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఏపీ, తెలంగాణ మధ్య గొడవ ముదరక ముందే కేంద్రం CRPF బలగాలను సాగర్ గేట్ వద్ద మోహరించింది.