TDP Janasena Alliance: పవన్ త్యాగం చేయాల్సిందేనా?
TDP Janasena Alliance: త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న (ap elections) ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (TDP), జనసేన (janasena) పార్టీలు కలిసి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని చర్చలు జరిపాక తెలుగు దేశం పార్టీ జనసేనకు 25 సీట్లు మాత్రమే ఇవ్వగలం అని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
TDPకి ఓటు బదిలీ జరగుతుందా?
తెలుగు దేశం పార్టీ జనసేనకు ఇచ్చే 25 సీట్ల వల్ల ఓట్లు బదిలీ అవుతాయా అనే చర్చ కూడా మొదలైంది. చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన తమ ఓటు బ్యాంకుని త్యాగం చేసేయాలా అంటూ జనసేనలో కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా వెళ్తే TDP భూస్థాపితం అవ్వడం ఖాయం. కాబట్టి TDPనే వెనక్కి తగ్గాలి. కానీ పవన్ కళ్యాణ్ (pawan kalyan) మెతక మనిషి. TDP ఎమోషనల్ బ్లామెయిల్ చేసి ఉంటే ఒప్పుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేము.