TDP: పవన్‌ని సీఎం చేయడానికి కాదు TDP ఉన్నది..!
TDP: జనసేనాని పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) ఏపీకి ముఖ్యమంత్రిని చేయడానికి కాదు తెలుగు దేశం పార్టీ ఉన్నది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి (syed rafi). అసలు ఇతను ఎవరి అనుమతి తీసుకుని ఈ విధంగా వ్యాఖ్యలు చేసారు తెలీదు కానీ జనసేనతో తెలుగు దేశం పొత్తులో ఉన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
పవన్‌ను సీఎం చేయడానికి తెలుగు దేశం పార్టీ లేదని.. సీఎం పదవి కావాలంటే పవన్ ఒంటరిగా పోటీ చేస్తే మంచిదని సయ్యద్ రఫి వ్యాఖ్యానించడం దుమారం లేపుతోంది. మరి ఇదే విషయం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అని ఉంటే అసలు పవన్ పొత్తు పెట్టుకోవాలో వద్దో కాస్త ఆలోచించుకునే సమయం అయినా ఉండేది అని జనసేన మద్దతుదారులు మండిపడుతున్నారు.