Nandi Awards స్థానంలో గ‌ద్ద‌ర్ అవార్డులు..!

Nandi Awards: ఒక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌దానం చేసే నంది అవార్డుల‌కు ఎంతో విలువ ఉండేది. ఈ అవార్డులు అందుకున్న‌వారికి ఇండ‌స్ట్రీలో ద‌క్కే గౌర‌వ‌మే వేరు అన్న‌ట్లుగా భావించేవారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిందో నంది అవార్డుల ప్ర‌దానోత్స‌వాన్ని కూడా నిలిపివేసారు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఆ అవార్డుల‌ను తెర‌పైకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. కాక‌పోతే నంది అవార్డుల‌కు బదులు గ‌ద్ద‌ర్ అవార్డులు (gaddar awards) అని పేరు మార్చి ప్ర‌దానం చేస్తార‌ట‌. ఈ మేర‌కు త్వ‌ర‌లో తెలంగాణ ప్ర‌భుత్వం జీవో పాస్ చేయ‌నుంది. గ‌ద్ద‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఏటా జ‌న‌వ‌రి 31న ఈ అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్నారు.