EXCLUSIVE: ష‌ర్మిళ ఒంట‌రిపోరాటం.. రేవంత్ రెడ్డి ప్లాన్ ఇదేనా?

EXCLUSIVE: కాంగ్రెస్ (congress) నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మాట‌కు మాట పంచ్‌కు పంచ్ ఇస్తూ ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ష‌ర్మిళ ఒంట‌రి పోరాటం చేస్తున్నా ఆమె కాస్త ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని.. ఎందుకంటే అక్క‌డ అధికారంలో ఉన్న‌ది సొంత అన్నే కాబ‌ట్టి మ‌రో అభ్య‌ర్ధిని పెట్టించి ష‌ర్మిళ‌కు స‌పోర్ట్ చేయించాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిళ‌కు సాయంగా కొండా సురేఖ‌ను (konda surekha) ఏపీకి పంప‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఒకప్పుడు జ‌గ‌న్ కోసం ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌కుండా కొండా సురేఖ దంప‌తులు పార్టీ కోసం క‌ష్ట‌పడ్డారు. కానీ అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ వారిని క‌రివేపాకును తీసి ప‌డేసిన‌ట్లు ప‌డేసారు. ఈ విష‌యాన్ని వారే ఓ సంద‌ర్భంలో వెల్ల‌డిస్తూ తాము జీవితంలో చేసిన అతిపెద్ద త‌ప్పు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మే అని బాధ‌ప‌డ్డారు. సో.. జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డానికి కొండా సురేఖ అయితేనే ప‌ర్ఫెక్ట్ అని రేవంత్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.