Shabbir Ali: KCR నేను రోడ్డు మీదకు వచ్చేసాం..!
Shabbir Ali: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు వార్నింగ్ ఇచ్చారు. మాటలు జాగ్రత్త అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మైనారిటీలను పట్టించుకోదని KTR ఇటీవల చేసిన కామెంట్స్‌పై షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఏ పోస్ట్ ఇచ్చినా మైనారిటీలకు కోటా ఉంటుందని తెలిపారు. అసలు KCR కామారెడ్డికి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. తనను ఓడిద్దామని వచ్చి తానే ఓడిపోయాడని ఎద్దేవా చేసారు.
BRS ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలలో మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్ అయినా కల్పించిందా అని ప్రశ్నించారు. అనవసరంగా KCR కామారెడ్డితో పోటీ చేయడంతో తన నియోజకవర్గాన్ని మార్చారని దాంతో KCR రోడ్డు మీదకు వచ్చినట్లే తానూ వచ్చానని సెటైర్ వేసారు. మైనారిటీలకు ఏమీ ఇవ్వకుండా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇప్పుడు KTR మాట్లాడితే ఏం లాభం అని అన్నారు. అలాంటి KTR కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదని మాటలు అనేముందు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.