EXCLUSIVE: “రామ‌కృష్ణ ఓటు మ‌న‌కే ప‌డేలా చూడు”

EXCLUSIVE: YSRCP నేత వైవీ సుబ్బా రెడ్డి (yv subba reddy) ఇటీవ‌ల పార్టీ అస‌మ్మ‌తి నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో (alla ayodhya rami reddy) మాట్లాడిన‌ట్లు స‌న్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవ‌ల ఆయ‌న‌ సోద‌రుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (alla ramakrishna reddy) ష‌ర్మిళ (ys sharmila) వెంటే ఉంటానంటూ కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.

అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ త‌మ ఎంపీల‌కు ఓటు ప‌డ‌కుండాపోతుందో అన్న భ‌యంతో సుబ్బారెడ్డి రామిరెడ్డికి ఫోన్ చేసి రామ‌కృష్ణారెడ్డి ఓటు త‌మ‌కే ప‌డాల‌ని చెప్పాల్సిందిగా కోరార‌ట‌. అయితే ఈ విష‌యంలో తాను ఏం చెప్పినా రామ‌కృష్ణారెడ్డి అస్స‌లు విన‌డ‌ని.. ఈ స‌మ‌యంలో రామ‌కృష్ణ ఎవ‌రి మాటైనా వింటాడంటే అది ష‌ర్మిళ ఒక్క‌రేన‌ని చెప్పారు. దాంతో ష‌ర్మిళ‌ను మ‌రోసారి సంప్ర‌దించి ఈ అంశాల గురించి చ‌ర్చించేందుకు సుబ్బారెడ్డి వెళ్ల‌నున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.