Jagtial: ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం

Jagtial: జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ICDS (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్)అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించగా.. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అమ్మాయి వయసు 14 ఏళ్లుగా తేలడంతో కుటుంబసభ్యులపై పొలీసులు కేసు నమోదు చేశారు.