Amy Jackson: “ఎవ‌డు” భామ రెండో పెళ్లి..!

Amy Jackson: తెలుగులో ఎవ‌డు, రోబో 2 సినిమాల్లో న‌టించిన అమీ జాక్స‌న్ రెండోసారి పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. హాలీవుడ్ న‌టుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ఆమె నిశ్చితార్ధం ఘ‌నంగా జ‌రిగింది. 2015లో జార్జ్ పాన్వాటూ అనే హాట‌లియ‌ర్‌తో కొంత‌కాలం పాటు డేటింగ్ చేసిన అమీ అత‌నితో పెళ్లి కాకుండానే బిడ్డ‌ను క‌న్నారు. ఆ త‌ర్వాత 2019లో విడిపోయారు. 2020 నుంచి అమీ ఎడ్ వెస్ట్‌విక్ డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు వీరి నిశ్చితార్ధం జ‌రిగింది. మ‌రి ఈ బంధం ఎన్నాళ్లు ఉంటుందో వేచి చూడాలి.