Janasena మీటింగ్‌లో జ‌గ‌న్ ఏం చేస్తున్నార‌బ్బా..!

Janasena: జ‌న‌సేన మీటింగ్‌లోకి ఉన్న‌ట్టుండి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  (jagan mohan reddy)వ‌చ్చారు. అలాగెలా సాధ్యం అనుకుంటున్నారా? అంటే ఏకంగా మ‌నిషి రాలేద‌నుకోండి. జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) జ‌గ‌న్ క‌టౌట్‌ను త‌యారుచేయించి తన ప‌క్క‌నే కూర్చోపెట్టుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. YSRCP ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాలు, త‌ప్పుల గురించి నిల‌దీస్తుంటే జ‌గ‌న్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి స‌మాధానం చెప్ప‌డంలేద‌ని.. ఆయ‌న ప్రెస్ ముందుకు రారు కాబ‌ట్టి తామే ఇలా జ‌గన్ కటౌట్‌ను పెట్టాల్సి వ‌చ్చింద‌ని మ‌నోహ‌ర్ అన్నారు.