Game Changer: ఆ ప‌ని చేయ‌ని ఏకైక టాలీవుడ్ సినిమా ఇదే..!

Game Changer: డైన‌మిక్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (shankar) డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఇంకా జ‌రుగుతూనే ఉంది. రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), కియారా అడ్వాణీ (kiara advani) న‌టిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి ఇప్ప‌టికే నాలుగేళ్లు అయిపోతోంది. ఈ నాలుగేళ్ల‌లో గేమ్ ఛేంజ‌ర్ టీం ఒక్క‌సారి కూడా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌లేదు. దాంతో ఈ సినిమాను ఈ ఏడాదైనా రిలీజ్ చేయ‌క‌పోరా అని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈరోజుల్లో ఒక పెద్ద సినిమా అనౌన్స్ అయ్యింది అంటే ఆ వెంట‌నే రిలీజ్ డేట్లు బ‌య‌టికి వ‌చ్చేస్తుంటాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు గేమ్ ఛేంజ‌ర్‌కు సంబంధించి ఒక్క రిలీజ్ డేట్ కూడా బ‌య‌టికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.