Koratala Siva కు సుప్రీంకోర్టు షాక్..!
Koratala Siva: ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో (supreme court) చుక్కెదురైంది. ఆయన సూపర్‌స్టార్ మహేష్ బాబుతో (mahesh babu) తీసిన శ్రీమంతుడు సినిమా కథ స్వాతి మ్యాగజైన్‌లో ప్రచురించిన కథ ఒకటే అని ప్రముఖ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కొరటాలపై కేసు వేసాడు. నాంపల్లి కోర్టు ఈ కేసును పరిశీలించి.. క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని తీర్పు వెల్లడించింది. దీనిని సవాల్ చేస్తూ కొరటాల సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది.