Anil Kumar Yadav: ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచేది తిట్టడానికా..?
Anil Kumar Yadav: YSRCP నేత అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇలాంటి నేతలను ఎన్నుకుంటే ఏం జరుగుతోంద ప్రజలకు ఇప్పటికైనా అవగాహన రావాలి. వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు నాపై ఉండాలి. జగనన్న గీత గీస్తే.. దాన్ని నేను దాటను. నిన్నటి దాకా అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా అంటూ అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమనుకుంటారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా అక్కడ తిడతా ఇక్కడ తిడతా అని ధైర్యంగా కామెంట్స్ చేసేస్తున్నారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచేది తిట్టడానికా ? ఇలాంటి వారికి ప్రజా ప్రతినిధులుగా ప్రజలు ఎలా ఎన్నుకోవాలి ?