Ambati Rambabu: “దీపాల‌తో సిగ‌రెట్ అంటించుకునే నీకెందుకు?”

Ambati Rambabu: జ‌న‌సేన (janasena) నేత నాగ‌బాబు (nagababu), YSRCP నేత అంబ‌టి రాంబాబుల మధ్య ట్విట‌ర్ వార్ నెల‌కొంది. ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను అర్జునుడిని అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడ‌టంతో నాగ‌బాబు జ‌గ‌న్‌ను ఉద్దేశిస్తూ సెటైర్ వేసారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో చుట్టి పక్కనపెట్టే మీకెందుకండి రామాయణ మహాభారత ఉదాహరణలు అని నాగ‌బాబు ట్వీట్ చేయ‌గా.. దానికి అంబ‌టి స్పందిస్తూ.. పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు! అని రిప్లై ఇచ్చారు. ఆ త‌ర్వాత నాగ‌బాబు జ‌గ‌న్ శంఖం ఊదిన ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. శంఖం సింక్‌లో ఊదుంటే బాగుండు, బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రైన్ సౌండ్ వస్తోంది, బిగిన‌ర్స్ మిస్టేక్స్ ఇవన్ని… ఇలాంటివి ముందే ‘సిద్దం’ అయితేనే సింకు, లింకు సరిగ్గా కుదరుతాయి అని చుర‌క‌లు అంటించారు.