Spiritual: దేవుళ్ల బొమ్మలను కానుకలుగా ఇవ్వచ్చా?
Spiritual: చాలా మంది కానుకలు అనగానే దేవుడి విగ్రహాలను, బొమ్మలను ఇస్తుంటారు. ఇవి ఇస్తే అంతా మంచే జరుగుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ.. వాస్తు ప్రకారం దేవుడి బొమ్మలను కానుకలుగా ఇస్తే కొన్ని నెగిటివ్ ప్రభావాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
*రాశి, జన్మ నక్షత్రాలు, తేదీలను బట్టి కొందరికి కొందరు దేవుళ్లను పూజిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని నమ్మేవారు ఉంటారు. అలాంటివారికి మీరు తెలీక ఇచ్చే దేవుడి విగ్రహం వల్ల గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుందట.
*కొన్ని విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. రోజూ వాటిని నిష్ఠగా పూజించాలి. ఉదాహరణకు ఇంట్లో శివలింగాన్ని అందరూ పెట్టుకోరు. ఎందుకంటే ఒక్కసారి ఇంటికి లింగాన్ని తెచ్చారంటే రోజూ పూజిస్తూనే ఉండాలి. లింగానికి పూజ చేయకుండా అలా వదిలేయకూడదు. అందుకే ఎందుకొచ్చిన రిస్క్ అని చాలా మంది ఇంటికి లింగాన్ని తెచ్చుకోరు.
*కొందరు ఆధ్యాత్మికతను పాటిస్తారు కానీ దేవుళ్లను పూజించడం, ఆలయాలకు వెళ్లడం వంటివి చేయరు. ఇలాంటివారికి బలవంతంగా విగ్రహాలు కొనివ్వడాలు వంటివి అస్సలు చేయకండి.