Telangana Congress @ 50 రోజులు..!

Telangana: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నేటికి 50 రోజులు పూర్త‌యింది. అధికారంలోకి వ‌చ్చిన‌ 100 రోజుల్లో తాము ప్ర‌క‌టించిన‌ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఎన్నికల్లో ఇచ్చిన మాటకి 50 రోజులు పూర్తయింది. కానీ ఇప్పటివరకు 6 గ్యారంటీలలో (13 హామీలు) 2 హామీలు పూర్తి చేసింది. మరో 50 రోజులలో 6 గ్యారంటీలలోని మిగతా 11 హామీలని నెరవేర్చడానికి సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది.