KTR: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో విజయం మ‌న‌దే

KTR: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్యంత స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయామ‌ని ఆ మాత్రం దానికి ఇంట్లో బాధ‌ప‌డుతూ కూర్చోవాల్సిన అవ‌సరం లేద‌ని అన్నారు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఎక్క‌డ కోల్పోయామో అక్క‌డే వెతుక్కోవాలి అన్న‌ట్లు తెలంగాణ‌లో BRS పార్టీ బ‌లం ఇంకా అలాగే ఉంద‌ని పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రుజువు చేస్తాయ‌ని అన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో BRS క్లీన్ స్వీప్ చేసింద‌ని.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత స్వ‌ల్ప ఓట్ల‌తో ఓడిపోవ‌డం వ‌ల్లే అధికారం కాంగ్రెస్‌కు వెళ్లిందని అన్నారు. హైద‌రాబాద్‌లో చాలా మంది అస‌లు BRS ఎలా ఓడిపోయింది అని మాట్లాడుకోవ‌డం విన్నాన‌ని.. అంటే ఇంకా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ పార్టీకే ఉంద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంద‌ని తెలిపారు.