Radika Sarathkumar: వాంతి చేసుకోవాల‌నిపించింది.. యానిమ‌ల్ గురించేనా?

Radika Sarathkumar: ప్ర‌ముఖ న‌టి రాధికా శ‌ర‌త్ కుమార్ నిన్న రాత్రి ఓ సినిమా చూసి వాంతి చేసుకోవాల‌నిపించింద‌ట‌. ఇలాంటి ద‌రిద్ర‌మైన సినిమాను ఎవ‌రైనా చూసారా అంటూ ట్విట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్యక్తం చేసారు. అయితే ఆమె ఏ సినిమా గురించి చెప్తున్నారు అనే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. ఆమె యానిమ‌ల్ (animal) సినిమా గురించే చెప్తున్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల విడుద‌లైన సినిమాల్లో యానిమ‌ల్ సినిమాకు వ‌చ్చినంత నెగిటివిటీ మ‌రే సినిమాకు రాలేదు. అందులోనూ 26న యానిమ‌ల్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. సో.. రాధిక యానిమ‌ల్ సినిమా గురించే మండిపడుతున్నార‌న్న‌మాట‌.