Ambati Rambabu: ఇప్పటికైనా తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!
Ambati Rambabu: పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మమూ పాటించని వాడే చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అని మరోసారి విమర్శలు గుప్పించారు YSRCP మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికైనా తెలుసుకో తమ్ముడూ పవన్ కళ్యాణ్ (pawan kalyan) అంటూ సలహా ఇచ్చారు.
తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా పాటించాల్సిన కనీస ధర్మాన్ని చంద్రబాబు ఉల్లంఘించారని పవన్ మండిపడుతున్నారు. ఇప్పుడే పోటీ చేయాల్సిన నియోజకవర్గాల వివరాలు ప్రకటించకూడదు అని ముందే మాట్లాడుకున్నారు. కానీ చంద్రబాబు పవన్ మాటలకు విలువ ఇవ్వకుండా నియోజకవర్గాలను ప్రకటించేస్తున్నారు. దాంతో పవన్‌కు ఒళ్లుమండి జనసేన కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుంది అని ప్రకటించేసారు. తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య మరింత వైరం పెంచేందుకు ఈ ఘటన YSRCPకి సులువుగా మారింది.