EXCLUSIVE: DMKలోకి రోజా?
EXCLUSIVE: YSRCP మంత్రి రోజా (roja) తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళనాడులో అధికారంలో ఉన్న DMK పార్టీలో ఆమె చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగిరి టికెట్ ఇచ్చినా కూడా రోజా గెలవకపోతే ఇక DMKలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఏపీలో గెలవాలి లేదా అసలు ఏపీ రాజకీయాల్లోనే ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయినట్లు రోజా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
రోజాకు తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు ఉంది. DMK పార్టీ ఆమెను ఆహ్వానించి టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మంచి మెజారిటీతోనే గెలిచే అవకాశం లేకపోలేదు. అధికారంలో మంత్రి స్థానంలో ఉంటేనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే ఆ బాధను, అవమానాన్ని భరించే శక్తి రోజాకు లేదు. అందుకే ఏపీ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేయాలని మెల్లిగా పావులు కదుపుతున్నారు. 2022లోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో రోజా ఓసారి భేటీ అయ్యారు. రోజా వస్తానంటే స్టాలిన్ టికెట్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆమె స్థాయికి తగ్గట్టు మంచి స్థానాన్ని కల్పించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు.