Vijayendra Prasad ని చుట్టుముట్టిన వివాదం ఏంటి? ఎందుకు ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నారు?

Vijayendra Prasad: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (ss rajamouli) తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో RRR సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), ఎన్టీఆర్ (jr ntr) పాత్ర‌ల గురించి ప్ర‌స్తావించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌ను అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చూపించాల‌నుకున్నాం కానీ ఉత్త‌రాది వారంతా ఆయ‌న్ను రాముడు అనుకున్నార‌ని.. కానీ త‌మ ఉద్దేశం మాత్రం చ‌ర‌ణ్‌ను రాముడిలా చూపించాల‌న్న‌ది కాద‌ని తెలిపారు.

ఎన్టీఆర్ పాత్ర గురించి భీమం భైర‌వం అనే పాట ఉంద‌ని అంటే భీమ్ పాత్ర కూడా అంతే ముఖ్యం అని చెప్పాల‌నుకున్నామ‌ని కానీ ఎవ్వ‌రూ కూడా ఆ పాత్ర‌తో క‌నెక్ట్ అవ్వ‌లేద‌ని తెలిపారు. దాంతో ఆయ‌న రామ్ చ‌ర‌ణ్‌ను హీరోగా.. ఎన్టీఆర్‌ను త‌క్కువగా చూపించేలా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట‌లు ఉన్నాయ‌ని.. ఆయ‌న వ్యాఖ్య‌లు దేవ‌ర (devara) సినిమాపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. రాజమౌళి త‌న తండ్రిని మీడియా ముందుకు ఎంత త‌క్కువ‌గా తీసుకొస్తే అంత మంచిది అని వార్నింగ్‌లు ఇస్తున్నారు.