Ayodhya: సీతారాములకు కాకుండా బాల రాముడికే ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది?
Ayodhya: అయోధ్యలో ఇటీవల బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ రాముడికి బాలక్ రామా అని నామకరణం చేసారు. అయోధ్య అంటే సీతారాములు ఉండటం ప్రధానం. కానీ ఎందుకు కేవలం బాల రాముడికు ప్రాణ ప్రతిష్ఠ చేసారో తెలుసా?
సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రామ్ లాల్ల (లాల్ల అంటే సంస్కృతంలో బాలుడు అని అర్థం) అని 5-6 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారు.
కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో భూమి తవ్వకాలు చేస్తే అదే బాల రాముని విగ్రహం బయట పడింది. అంటే దాని అర్ధం ఇది మన చరిత్ర కదా !!! మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మిస్తున్నాం కదా.. అప్పుడు ఎవరికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి? మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాములు వారికి కదా చేయాలి !!!
బాల రాములు వారు వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు. అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భ గుడిలో బాల రాములవారు ఉన్నారు. ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి. గుడి పూర్తిగా నిర్మాణం అయ్యాక సీత రాముల లక్ష్మణ హనుమ స్వామితో సహా ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే మాత కౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారు.