Jagga Reddy: ప్రతిపక్ష పార్టీ వారెవరైనా సీఎంను కలవచ్చు
Jagga Reddy: ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరైనా తెలంగాణ ముఖ్యమంత్రిని కలవచ్చు అనే మంచి పరిణామానికి రేవంత్ రెడ్డి (revanth reddy) మరోసారి తెరలేపారని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి. నిన్న కొందరు BRS నేతలు రేవంత్‌ను కలిసి బొకేలు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇవ్వడం పెద్ద రాద్దాంతానికి దారి తీసింది. వారంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని చాలా మంది అనుకున్నారు. దీనిపై వారు కూడా స్పందించారు.
రేవంత్‌ను మరో వెయ్యి సార్లు కలుస్తామని.. చచ్చేవరకు BRS పార్టీలోనే ఉంటామని మహిపాల్ రెడ్డి కూడా అన్నారు. KCR ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఏ ప్రతిపక్ష నేతను కూడా దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదని.. ప్రతిపక్ష నేతలు కూడా సీఎంను కలవచ్చు అనే పాత సంప్రదాయానికి రేవంత్ మరోసారి తెరలేపడం శభసూచకం అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.