Viral News: పొరపాటున ఎక్కువ జీతం.. తిరిగిచ్చేయాలంటూ డిమాండ్!
Viral News: ఏటా ఆలయానికి ట్రస్ట్‌ల నుంచి కొంత నగదు వెళ్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలు చూసుకోవడానికి కోశాధికారిని నియమిస్తుంటారు. అయితే ఓ కోశాధికారి చేసిన తప్పిదానికి ఆలయ ప్రధాన అర్చకులు నిందల పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమగళూరులోని కోదండరామ స్వామి ఆలయానికి ఏటా రూ.25,000 నుంచి రూ.60,000 వరకు ఆర్థిక సాయం వెళ్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలను స్థానిక తహసీల్దారుకు అప్పగించారు. అయితే 2012 నుంచి ఆ తహసీల్దారు పంపాల్సిన దాని కంటే ఎక్కువ.. అంటే ఏటా రూ.90,000 వరకు నగదుకు ఆలయానికి పంపుతున్నారట. అయితే ఇది ఆయన కావాలని చేసిన పని కాదు.
ఇటీవల లెక్కలు తీసి చూస్తే పంపాల్సిన దాని కంటే రూ.4.25 లక్షలు ఆలయానికి ఎక్కువగా వెళ్లిందని తెలిసి అధికారులు షాకయ్యారు. దాంతో ఆలయ పూజారికి ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. ఆ తర్వాత తప్పు తహసీల్దారుది అని తెలిసి ఆయన నుంచి వసూలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.