Ganta Srinivasarao: జ‌గ‌న్‌కు ద‌మ్ముంటే నిల‌దీయ‌మనండి

Ganta Srinivasarao: తెలుగు దేశం పార్టీ (TDP) ఎంపీ గంటా శ్రీనివాస్ రావు రాజీనామాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత ఆమోదం తెల‌ప‌డంపై మండిప‌డ్డారు. లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా తెలివిగా వ్య‌వ‌హరించింద‌ని అనుకుంటోంద‌ని నిజానికి అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఓడిపోబోతున్నది YSRCP పార్టీనే అని తెలిపారు.  ఆనాడు చేసిన రాజీనామాకు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు పేర్కొన్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తాము రాజీనామాల వ‌ర‌కు వెళ్లామ‌ని.. మ‌రి ఏపీ సీఎంగా జ‌గ‌న్‌కు ద‌మ్ముంటే అంశం గురించి పార్ల‌మెంట్‌లో కేంద్రాన్ని నిల‌దీయ‌గ‌ల‌రా అని స‌వాల్ విసిరారు.