EXCLUSIVE: ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ముందే ఖాళీ అవుతున్న YSRCP

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో YSRCP ఖాళీ అవుతోంది. సీట్లు ఇవ్వ‌ర‌ని కొంద‌రు.. ఇన్‌ఛార్జిల‌ను మార్చేసార‌ని ఇంకొంద‌రు రాజీనామాలు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఈసారి పార్టీ గెల‌వ‌దేమోన‌న్న సందేహంతో తెలుగు దేశం (tdp), జ‌న‌సేన‌ల్లో (janasena) చేరిపోతున్నారు. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టిస్తే ఇక మొత్తానికే ఖాళీ అయిపోతుంద‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నేత‌లు.

మొన్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. (jagan mohan reddy) తెలంగాణ మాజీ సీఎం KCRను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ప్పుడు ఒక మాట చెప్పార‌ట‌. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించే వ‌ర‌కు ప్ర‌జ‌లు త‌మ పార్టీ వైపే మొగ్గు చూపార‌ని ఎప్పుడైతే ఎన్నిక‌ల సంఘం తేదీని ప్ర‌క‌టించిందో ప్ర‌జ‌ల మ‌న‌సు కూడా మారిపోయింద‌ని చెప్పార‌ట‌. కానీ ఏపీలో మాత్రం ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రావ‌డానికి ఏడాది నుంచే ప్ర‌జ‌ల చూపు తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల వైపు ఉంద‌ని అంటున్నారు.