RGV: శ్రీదేవి.. కన్నీళ్లాగట్లేదు
RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి (ram gopal varma) అలనాటి తార శ్రీదేవి (sridevi) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను ఏకంగా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. శ్రీదేవి చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల కంటే వర్మే ఎక్కువ బాధపడ్డారు. అయితే ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి శ్రీదేవి ఫోటోను తయారుచేసి వర్మకు పంపారు. ఆ ఫోటోను వర్మ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఈ ఫోటో చూసాక తనకు కన్నీళ్లు ఆగడంలేదని అన్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం, గోవింద గోవింద సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.